NTR | ఈ రోజు దసరా శుభాకాంక్షలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిత్రం కాంతార చాప్టర్ 1. ఎలాంటి అంచనాలు లేకుండా వచ్చి సంచలనాలు సృష్టించిన కాంతార చిత్రానికి ప్రీక్వెల్‌గా ఈ మూవీ రూపొందింది.ఈ సినిమాపై తాజాగా జూనియర్ ఎన్టీఆర్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. చిత్రం మంచి విజయం సాధించినందున కాంతార చాప్టర్ 1 టీమ్‌కి నా అభినందనలు. ముఖ్యంగా రిషబ్ శెట్టి తీ చిత్రంతో ఊహకందని అద్భుతాన్ని సృష్టించాడు. రిషబ్‌పై ఉన్న నమ్మకంతో ఈ ప్రాజెక్ట్‌ని నిర్మించిన హోంబలే ఫిల్మ్స్‌తో పాటు చిత్ర బృందానికి నా ప్రత్యేక శుభాకాంక్షలు అంటూ ఎన్టీఆర్ తన పోస్ట్‌లో రాసుకొచ్చారు. ప్రస్తుతం ఎన్టీఆర్ పోస్ట్ వైరల్‌గా మారింది.
రిషబ్ శెట్టి ఈ సినిమాతో మళ్ళీ తన విశ్వరూపం చూపించాడు. దర్శకుడిగా నటుడిగా తనది వన్ మ్యాన్ షో. మరోసారి పూనకాలు తెప్పించాడు. కనకావతి పాత్రలో రుక్మిణి ఆకట్టుకుంది. జయరామ్ కి కూడా బలమైన పాత్ర దక్కింది. కులశేఖర పాత్రని ఇంకా బలంగా తీర్చిదిద్దాల్సింది. మిగతా పాత్రలు పరిధిమేర ఉన్నాయి. టెక్నికల్ గా కూడా సినిమా రిచ్ గా వుంది. అటవీ నేపధ్యం స్క్రీన్ కి ఫ్రెష్ నెస్ తీసుకొచ్చింది. కెమెరా వర్క్ బ్రిలియంట్ గా వుంది. యాక్షన్ కొరియోగ్రఫీకి మంచి మార్కులు పడతాయి. అజనీష్ లోక్‌నాథ్ మ్యూజిక్ ఈ సినిమాకి మరో బిగ్ ఎసెట్. మంచి విజువల్ ఎఫెక్ట్స్ కుదిరాయి. ప్రొడక్షన్ వాల్యూస్ ఉన్నతంగా వున్నాయి. ఈ సినిమా కాంతార అంత హిట్ కాకపోవచ్చు కాని కొంత మేర వసూళ్లు రాబడుతుందని అంటున్నారు.
ఇక ఇదిలా ఉంటే కాంతార ఛాప్టర్ 1 ప్రీ రిలీజ్ వేడుకలో ఎన్టీఆర్ చాలా ఇబ్బంది పడడం మనం చూశాం. ప్రతీసారి రిబ్స్ దగ్గర చేతులు పెట్టుకుని ఈవెంట్ అంతా ఇబ్బంది పడుతూనే ఉన్నారు తారక్. ఎన్టీఆర్ ఇంకా కోలుకోకపోయిన తన స్నేహితుడు రిషబ్ కోసం ఈవెంట్‌కి హాజరై సందడి చేశాడు. యాడ్ షూట్లో గాయపడ్డ తారక్‌కు రిబ్స్ దగ్గర గాయం కాగా, ఆయనకు వైద్యులు 3 వారాలు విశ్రాంతి తీసుకోమ్మన్నారు. దాంతో అక్టోబర్ చివర్లో లేదంటే నవంబర్ మొదటి వారంలో డ్రాగన్ షూట్లో జాయిన్ కానున్నారు ఎన్టీఆర్.