Allu Arjun Birthday | నేషనల్ అవార్డు విన్నర్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నేడు తన 43వ పుట్టినరోజును జరుపుకుంటున్నాడు. ఈ క్రమంలోనే ఆయనకు అభిమానులతో పాటు సినీ ప్రముఖులు బర్త్‌డే విషెస్ తెలుపుతున్నారు. తాజాగా అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్(Jr. NTR) కూడా అల్లు అర్జున్‌కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపాడు. ఈ సందర్భంగా బావ అంటూ ప్రత్యేక పోస్ట్ పెట్టాడు. ”జన్మదిన శుభాకాంక్షలు అల్లు అర్జున్ బావ. ఈ సంవత్సరం నీకు మరింత శక్తి, ప్రేమతో పాటు మరిన్ని విజయాలు తీసుకురావాలని కోరుకుంటున్నానంటూ” ఎన్టీఆర్ రాసుకోచ్చాడు. దీనిపై స్పందించిన అల్లు అర్జున్.. బావ.. నీ అందమైన శుభాకాంక్షలకు చాలా ధన్యవాదాలు. నీకు మరింత ప్రేమ, శక్తి కలగాలని కోరుకుంటున్నానంటూ బన్నీ రాసుకోచ్చాడు.
సినిమాల విషయానికి వస్తే.. ఎన్టీఆర్ ప్రస్తుతం వార్ 2 సినిమాతో పాటు సలార్ దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో ఒక సినిమా చేస్తున్నాడు. అల్లు అర్జున్ తమిళ దర్శకుడు అట్లీతో తన కొత్త ప్రాజెక్ట్‌ను తాజాగా ప్రకటించాడు.
Many happy returns of the day Bava @alluarjun… May this year bring you more power, love, and milestones…
— Jr NTR (@tarak9999) April 8, 2025