Hrithik Roshan | దేశమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాల్లో ‘వార్ 2’ ఒకటి. యష్‌రాజ్ ఫిల్మ్స్ స్పై యూనివర్స్‌లో భాగంగా రానున్న ఈ అడ్వెంచరస్ థ్రిల్లర్‌లో హృతిక్‌రోషన్, ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో రూపొందుతోన్న ఈ చిత్రం ఆగస్ట్ 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇదిలావుంటే.. ఈ నెల 20న తారక్ పుట్టిన రోజు సందర్భంగా ‘వార్2’కు సంబంధించిన అప్డేట్ని హీరో హృతిక్ రోషన్ తన ఎక్స్(ట్విటర్) ద్వారా అందించారు.
‘హే తారక్.. ఈ ఏడాది మే 20న ఏ అప్డేట్ రాబోతుందో? అసలు ఏం జరగబోతుందో నీకు తెలుసా?.. నువ్వు అస్సలు ఊహించలేవ్.. మీరంతా సిద్ధంగా ఉండండి..’ అంటూ హృతిక్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో ఓ రేంజ్లో వైరల్ అవుతున్నది. ఎన్టీఆర్ పుట్టినరోజైన ఈనెల 20న ఈ సినిమా గ్లింప్సో, లేక ట్రైలరో ఏదో ఒకటి విడుదల చేయనున్నట్టు హృతిక్ చెప్పకనే చెప్పారు. దాంతో మే 20 కోసం తారక్ అభిమానులంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.