కల్యాణ్‌రామ్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘బింబిసార’. పీరియాడికల్ యాక్షన్ ఇతివృత్తంతో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వశిష్ఠ్ దర్శకత్వం వహిస్తున్నారు. త్వరలో ఈ సినిమా టీజర్‌ను విడుదల చేసేందుకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఈ టీజర్‌కు వాయిస్ ఓవర్‌ను అగ్ర కథానాయకుడు ఎన్టీఆర్ అందించబోతున్నట్లు సమాచారం.
ఎన్టీఆర్ గళంతోనే కథ, పాత్రల్ని పరిచయం చేయనున్నట్లు తెలిసింది. టీజర్‌కు ఆయన వాయిస్ ప్రధానాకర్షణగా నిలుస్తుందని చెబుతున్నారు. ఐదో శతాబ్దానికి నేటి ఆధునిక కాలాన్ని ముడిపెడుతూ రూపొందిస్తున్న ఈ సినిమాలో బింబిసారుడనే చక్రవర్తిగా నెగెటివ్ షేడ్స్‌తో కూడిన పాత్రలో కల్యాణ్‌రామ్ కనిపించబోతున్నారు. కేథరిన్, సంయుక్తామీనన్ కథానాయికలుగా నటిస్తున్నారు. లాక్డౌన్ కారణంగా వాయిదాపడిన ఈ సినిమా చిత్రీకరణను త్వరలో పునఃప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. హరికృష్ణ నిర్మిస్తున్న ఈ చిత్రం ఈ ఏడాది విడుదలకానుంది.