జూనియర్ ఎన్టీఆర్ తన అభిమానులని ప్రాణంగా ప్రేమిస్తాడు. ఎవరికి ఏ కష్టమొచ్చిన కూడా తాను ఉన్నాననే ఓ భరోసా కలిపిస్తాడు. ఒక్కోసారి చావుబతుకుల మధ్య ఉన్న వారిలో ధైర్యం నూరిపోసి వారికి మరింత ధైర్యం కలిపిస్తుంటాడు. ఇటీవల తూర్పు గోదావరి జిల్లాలోని రాజోలుకు చెందిన కొప్పాడి మురళీ రోడ్డు ప్రమాదంలో గాయపడ్డాడు. అతను ఎన్టీఆర్‌కి వీరాభిమాని
రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ మురళీ ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించడంతో వైద్యులు ఆయన ఇష్టాఇష్టాలను తెలుసుకునే ప్రయత్నం చేయగా, తన అభిమాన హీరో ఎన్టీఆర్‌తో ఒక్కసారి మాట్లాడాలని ఉందని చెప్పాడు. ఈ విషయం తారక్‌కి చేరడంతో వీడియో కాల్ చేసి అతనితో మాట్లాడారు. అధైర్యపడొద్దని, సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి రావాలని ఎన్టీఆర్ ఆకాంక్షించారు. ఎన్టీఆర్‌ని కాల్లో చూసి అభిమాని సంతోషించారు.
ప్రస్తుతం ఎన్టీఆర్ ఎవరు మీలో కోటీశ్వరులు కార్యక్రమంతో పాటు కొరటాల దర్శకత్వంలో రూపొందనున్న సినిమాతో బిజీగా ఉన్నాడు. కొద్ది రోజుల క్రితం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ పూర్తి చేయగా, ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది జనవరి 7న విడుదల చేయబోతున్నారు.