NTR – Trivikram | మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ టాప్ డైరెక్టర్స్‌లో ఒకరు. ‘గుంటూరు కారం’ మూవీ తర్వాత త్రివిక్రమ్ నుండి మరో సినిమా రాలేదు. ఈ సినిమా విడుదలై ఏడాదికి పైగానే అవుతుంది. అయితే త్రివిక్రమ్ తన తదుపరి ప్రాజెక్ట్‌గా బన్నీతో మూవీ చేస్తాడని అందరు అనుకున్నారు. కాని బన్నీ కోలీవుడ్ డైరెక్టర్ అట్లీ తో కలిసి క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు. దీంతో త్రివిక్రమ్ తన తదుపరి ప్రాజెక్ట్‌ని ఎవరితో చేస్తాడనే చర్చ మొదలైంది. ఆ మధ్య విక్టరీ వెంకటేష్‌తో ఓ మూవీ చేయనున్నట్టు ప్రచారం జరిగింది. ఇక ఆ తర్వాత గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌తో మూవీ చేసేందుకు రెడీ అయ్యారని వార్తలు వచ్చాయి. ప్రస్తుతం రామ్ చరణ్.. బుచ్చిబాబు దర్శకత్వంలో ‘పెద్ది’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్‌తో రామ్ చరణ్ సినిమా చేయనున్నాడని అన్నారు.
కట్ చేస్తే ఇప్పుడు త్రివిక్రమ్ ఖాతాలో ఎన్టీఆర్ కూడా చేరాడు. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ శ్రీనివాస్ ప్లాన్ చేసిన మైథలాజికల్ మూవీని ఇప్పుడు ఎన్టీఆర్‌తో చేయనున్నాడట. ప్రస్తుతం ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ మూవీతో బిజీగా ఉన్నారు. ఈ సినిమా పూర్తి కావడానికి చాలా సమయం పడుతుంది. ఆ లోపు త్రివిక్రమ్.. వెంకీ, రామ్ చరణ్‌లతో మూవీలు చేసి ఆ తర్వాతే ఈ మైథలాజికల్ ప్రాజెక్ట్ నిసెట్స్పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. ఇలా వరుస ప్రాజెక్టులు లైనప్‌లో పెడుతున్నారు త్రివిక్రమ్. మైథలాజికల్ మూవీకి సంబంధించిన స్టోరీని ఇప్పటికే ఎన్టీఆర్‌కి వినిపించినట్లుగా ఇండస్ట్రీ వర్గాల టాక్.
ఈ మైథలాజికల్ స్క్రిప్ట్ ఎన్టీఆర్‌కు కూడా కరెక్ట్‌గా సరిపోతుందని మాటల మాంత్రికుడు భావిస్తున్నారట. ఇక ఈ చిత్రానికి అనిరుథ్ సంగీతం అందించబోతున్నారట. త్వరలోనే దీనికి సంబంధించిన అఫీషియల్ ప్రకటన రానుందని అంటున్నారు. ‘అరవింద సమేత’ తర్వాత ఎన్టీఆర్, త్రివిక్రమ్ కలిసి పని చేస్తారనే టాక్ కొంతకాలం వినిపించింది. ‘గుంటూరు కారం’ స్టోరీనే ఎన్టీఆర్‌తో చేయాల్సి ఉండగా, దాన్నే మహేష్ బాబుతో తీశారనే టాక్ అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మరి బన్నీతో చేయాల్సిన ఈ మైథలాజికల్ ప్రాజెక్టు ఎన్టీఆర్‌తో చేస్తారనే వార్తల్లో నిజమెంత ఉందో రానున్న రోజులలో తెలుస్తుంది. మైథలాజికల్ మూవీని పురాణాల్లో ఎవరికీ తెలియని ఓ దేవుని కథ ఆధారంగా రూపొందిచనున్నారనే టాక్ నడుస్తుంది.