NTR – TRIVIKRAM | యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం సినిమాల పరంగా దూసుకుపోతున్నాడు. చివరిగా దేవర పార్ట్ 1 చిత్రంతో సందడి చేసిన తారక్, మరి కొద్ది రోజులలో వార్ 2 చిత్రంతో పలకరించబోతున్నాడు. ఈ సినిమాతో బాలీవుడ్ మార్కెట్లో కూడా తన హవా కొనసాగించనున్నాడు. హృతిక్ రోషన్‌తో కలిసి చేస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్ ఆగష్టు 15న విడుదల కానుండగా, ఫ్యాన్స్ మూవీపై ఓ రేంజ్లో ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు. మరోవైపు తారక్ ..మాస్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో హై-వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో మాస్ ట్రీట్ పక్కా రానుందని అంటున్నారు.
ఇక జూనియర్ ఎన్టీఆర్.. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ భారీ మైథాలజికల్ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు ఫిల్మ్ నగర్లో జోరుగా ప్రచారం నడుస్తుంది. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందబోయే ఈ సినిమాకి సంబంధించిన కథపై ఇప్పటికే చర్చలు జోరుగా సాగుతున్నాయి. నిర్మాత నాగ వంశీ ఇటీవల ఇచ్చిన హింట్ ప్రకారం, ఈ కథ ఓ పౌరాణిక శక్తిరూపం అయిన సుబ్రహ్మణ్య స్వామి ఆధారంగా ఉండబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. కుమారస్వామి, కార్తికేయ, మురుగన్ అని పిలిచినా అది ఆ ఒక్క దేవత రూపమే. అయితే త్రివిక్రమ్ ఈ పౌరాణిక అంశాన్ని ఎలా స్క్రీన్ పై ఆవిష్కరించబోతున్నారు? స్కంద పురాణం నుంచి ఎలాంటి సంఘటనలను కథలో మిళితం చేయబోతున్నారు? అన్నది సినీ ప్రేమికుల్లో ఆసక్తిని రేపుతోంది.
తారక్ – త్రివిక్రమ్ మూవీ ఈ ఏడాది ప్రారంభమవుతుందనే ఊహాగానాలు వినిపించినా, తాజా సమాచారం ప్రకారం ఇది 2026కి వాయిదా పడే అవకాశం ఉంది. ఈలోగా తారక్ ప్రశాంత్ నీల్ సినిమా పూర్తి చేస్తే, త్రివిక్రమ్ కూడా విక్టరీ వెంకటేష్ తో ఒక మూవీ పూర్తి చేయనున్నట్టు సమాచారం.తారక్ అంటేనే అన్ని రకాల పాత్రలను అవలీలగా చేయగల సత్తా ఉన్న నటుడు. ముఖ్యంగా పౌరాణిక పాత్రల్లో తన వేషధారణ, డైలాగ్ డెలివరీ తో అదరగొడతాడు. అలాంటి తారక్‌తో త్రివిక్రమ్ చేస్తోన్న ఈ సినిమా అతని కెరీర్లో మరో మైలురాయిగా నిలవనుందని విశ్లేషకుల అంచనా. ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన అధికారిక అప్డేట్ ఎప్పుడొస్తుందో అని అభిమానులు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నారు.