NTR- Ram Charan | ఎన్టీఆర్, హృతిక్ రోషన్ ముఖ్య పాత్రల్లో నటించిన ‘వార్ 2’ సినిమా ఆగస్టు 14న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న విషయం తెలిసిందే. అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో, యష్ రాజ్ ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రం భారీ అంచనాల నడుమ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. తెలుగు వెర్షన్ ను సితార ఎంటర్టైన్మెంట్స్ అధినేత నాగవంశీ విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా, ఎన్టీఆర్ 25 ఏళ్ల సినీ ప్రయాణాన్ని పురస్కరించుకుని హైదరాబాద్‌లో గ్రాండ్ లెవల్లో ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. వేలాది మంది ఎన్టీఆర్ అభిమానులు భారీగా తరలిరావడంతో సందడి వాతావరణం కనిపించింది. ఈవెంట్‌ను నియంత్రించేందుకు దాదాపు 1200 మంది పోలీసులు విధుల్లో పాల్గొన్నారు.
ఆదివారం రోజు అయినా కూడా ప్రభుత్వ సహకారంతో, పోలీసుల అండతో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించగలిగామని నిర్మాత నాగవంశీ తెలిపారు. వేడుకలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ కూడా పాల్గొని అభిమానులను అలరించారు. “ఎన్టీఆర్ మీకు అన్నయ్య అయితే, నాకు తమ్ముడు,” అంటూ స్టేజిపై మాట్లాడుతూ, “నేను రియల్ టైగర్‌తో నటించాను.. అతడు ఈ స్థాయిని తన ప్రతిభతో సాధించాడు!” అంటూ ఎన్టీఆర్‌ను ప్రశంసలతో ముంచెత్తారు. అయితే ఈ వేడుకలో ఎన్టీఆర్ అభిమానుల రచ్చ తారాస్థాయికి చేరింది. ఎన్టీఆర్ మాట్లాడుతున్నప్పుడు అభిమానులు గట్టిగా అరవడం, చొక్కాలు విప్పి గాల్లో ఊపడం, కేకలు వేయడం వంటివి చేశారు. ఫలితంగా, ఎన్టీఆర్ తన కోపాన్ని నియంత్రించలేకపోయారు.
ఎన్టీఆర్ మాట్లాడేప్పుడు చాలా డిస్ట్రబ్ చేయడంతో అభిమానులను హెచ్చరిస్తూ .. తాను ఇక్కడి నుంచి వెళ్లిపోవడం ఒక్క సెకండ్ పడుతుందని హెచ్చరించారు. అభిమానుల వైపు సీరియస్ గా చూస్తూ… ”ఒక్క సెకండ్ పట్టదు.. మైక్ ఇచ్చి వెళ్లిపోతాను!”అంటూ ఫ్యాన్స్ ని హెచ్చరించారు. అనంతరం తన స్పీచ్ ని కొనసాగించారు. అయితే ఈ వీడియోతో రామ్ చరణ్ వీడియోని కంపేర్ చేస్తూ ఎన్టీఆర్‌ని ట్రోల్ చేస్తున్నారు. ఓ ఈవెంట్లో రామ్ చరణ్ మాట్లాడుతున్నప్పుడు కూడా డిస్ట్రబ్ చేస్తే ఆ సమయంలో చరణ్ థ్యాంక్యూ థ్యాంక్యూ అంటూ కిసెస్ ఇచ్చారే తప్ప అరవలేదని ఎన్టీఆర్‌కి వ్యతిరేఖంగా కామెంట్స్ చేస్తున్నారు. దీనికి జూనియర్ ఫ్యాన్స్ కూడా తమదైన శైలిలో కౌంటర్ ఇస్తున్నారు. ఇలా ఎన్టీఆర్, రామ్ చరణ్ ఫ్యాన్స్ మధ్య ట్విట్టర్ వార్ నడుస్తుంది.
Don’t ever compare this guy with Charan 😭 #JrNTR #RamCharan pic.twitter.com/DRO2XT9TL7
— MysoreBonda 🚩 (@MysoreB0nda) August 10, 2025