NTR31 Movies | ట్రిపుల్ఆర్తో తారక్ క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. మొన్నటి వరకు టాలీవుడ్‌కే పరిమితమైన క్రేజ్ ఇప్పుడు ఇంటర్నేషనల్ లెవల్‌కు వెళ్లిపోయింది. ఈ క్రమంలో తారక్ కూడా ఆచి తూచి కథలను ఎంపిక చేసుకుంటున్నాడు. ఇక పై చేయబోయే సినిమాలన్నీ తన మార్కెట్‌ను పెంచేలానే ఉండాలని పక్కాగా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ లైనప్ చూసుకుంటే అన్నీ భారీ రేంజ్ సినిమాలే ఉన్నాయి. ఇక తారక్ ప్రస్తుతం కొరటాల శివతో దేవర అనే అవుట్ అండ్ అవుట్ మాస్ యాక్షన్ సినిమా చేస్తున్నాడు. నిన్న రిలీజైన ఫస్ట్‌లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి తిరుగలేని రెస్పాన్స్ వచ్చింది. రగ్గుడ్ లుక్‌లో ఇంటెన్సీవ్‌గా చూస్తున్న పోస్టర్ తారక్ అభిమానులను పిచ్చెక్కించింది.
ఇక తారక్ లైనప్‌లో ప్రశాంత్ నీల్ కూడా ఉన్నాడు. ఇప్పటికే అనౌన్స్మెంట్ వచ్చేసిన ఈ సినిమా ప్రస్తుతం హోల్డ్‌లో ఉంది. సలార్ రిలీజ్ తర్వాత ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్ట్‌పై ఫోకస్ పెట్టనున్నాడు. ఇక ఇదిలా ఉంటే తాజాగా చిత్రబృందం ఈ సినిమాకు సంబంధించిన బిగ్ అప్డేట్ను ప్రకటించింది. ఎన్టీఆర్‌కు బర్త్‌డే విషెస్ చెబుతూ.. ఈ సినిమాను వచ్చే ఏడాది మార్చ్‌లో సెట్స్ మీదకు తీసుకెళ్లనున్నట్లు ప్రకటించింది. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్స్ట్ బ్యానర్లు సంయుక్తంగా ఈ సినిమాను నిర్మిస్తున్నాయి.
Team #NTR31 wishes @tarak9999 a very Happy Birthday 🔥🔥
On to the sets from March 2024 💥💥#HappyBirthdayNTR#PrashanthNeel @NTRArtsOfficial pic.twitter.com/Mi769WTE2o
— Mythri Movie Makers (@MythriOfficial) May 20, 2023