Sidhant Gupta | ‘డ్రాగన్’ మూవీ క్రేజీ అప్డేట్.. ఎన్టీఆర్ తమ్ముడిగా బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ గుప్తా!
Dragon | జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా యాక్షన్ ఎపిక్ 'డ్రాగన్' సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
Dragon | జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ పాన్-ఇండియా యాక్షన్ ఎపిక్ ‘డ్రాగన్’ సినిమాకు సంబంధించి ఒక క్రేజీ అప్డేట్ సోషల్ మీడియాలో ప్రస్తుతం వైరల్‌గా మారింది. ఈ సినిమాలో ఒక కీలకమైన పాత్ర కోసం మొదట మలయాళ స్టార్ హీరో టోవినో థామస్‌ను అనుకున్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాకు చాలా ఎక్కువ రోజులు కాల్షీట్స్ కేటాయించాల్సి రావడం, దానివల్ల తన మిగతా మలయాళ ప్రాజెక్టులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో టోవినో ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకోగా.. అతడి పోషించే పాత్రలో బాలీవుడ్ నటుడు సిద్ధాంత్ గుప్తా నటించినట్లు తెలుస్తుంది. ‘జుబిలీ’, ‘ఫ్రీడమ్ ఎట్ మిడ్నైట్’ వంటి వెబ్ సిరీస్‌లతో మెప్పించిన సిద్ధాంత్ గుప్తా ఈ చిత్రంతోనే టాలీవుడ్లోకి గ్రాండ్‌గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు.
ఈ చిత్రంలో సిద్ధాంత్ గుప్తా ‘బాబీ సర్కార్’ అనే పాత్రలో కనిపించబోతుండగా.. ఆఫ్ఘన్ ట్రేడింగ్ కంపెనీ (ATC)కి ‘వజీర్’ (ముఖ్య సూత్రధారి)గా వ్యవహరించే ఈ క్యారెక్టర్, సినిమాలో ఎన్టీఆర్ పోషిస్తున్న ‘లూగర్’ అనే పాత్రకు సోదరుడిగా ఉంటుందని సమాచారం. మైత్రీ మూవీ మేకర్స్ ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఎన్టీఆర్ అత్యంత క్రూరమైన స్మగ్లింగ్ సిండికేట్ అసోసియేట్ పాత్రలో కనిపించబోతున్నారు. అనిల్ కపూర్ రఘువీర్ రాథోడ్‌గా నటిస్తుండగా, రుక్మిణి వసంత్ హీరోయిన్గా నటిస్తోంది. బిజు మీనన్, ఖుష్బూ ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రానికి రవి బస్రూర్ సంగీతాన్ని అందిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ యాక్షన్ విజువల్ వండర్ జూన్ 11, 2027న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రానుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- BobySarkar Luger
- Dragon
- jrntr
- NTR31
RELATED ARTICLES
తాజా వార్తలు
నాలుగోసారి ‘మిస్టర్ సింగరేణి’గా రామకృష్ణ
Sonam Wangchuk | నాయకులను రేపటిలోగా విడుదల చేయకపోతే.. నిరాహార దీక్ష చేస్తా: సోనమ్ వాంగ్‌చుక్
SA vs AUS | రెన్షా ‘తొలి డబుల్’ చేజారే.. తొలి ఇన్నింగ్స్‌లో ఆస్ట్రేలియా ఆలౌట్..!
Oppo F35 | ఒప్పో నుంచి ఎఫ్35, ఎఫ్35 ప్రో ఫోన్లు విడుదల.. అక్టోబర్ 11 నుంచి సేల్
Electrocution | విద్యుత్ షాక్‌తో కౌలు రైతు మృతి
ట్రెండింగ్ వార్తలు
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!

