Ntr | మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, మాస్ యాక్షన్ సినిమాలకి కేరాఫ్ అడ్రెస్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ ప్రాజెక్ట్ ‘డ్రాగన్’పై అభిమానుల్లో ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. పాన్ ఇండియా స్థాయిని దాటి, అంతర్జాతీయ లెవెల్లో రూపొందుతున్న ఈ సినిమా కోసం సినీ ప్రేమికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.అయితే ఈ భారీ ప్రాజెక్ట్ షూటింగ్ ఊహించినంత వేగంగా సాగడం లేదు. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమై చాలా కాలం గడిచినా, తాజా సమాచారం ప్రకారం సినిమా కేవలం 40 శాతం మాత్రమే పూర్తి అయినట్లు తెలుస్తోంది. దీంతో ఈ సినిమా విడుదలకు ఇంకా చాలా సమయం పట్టే అవకాశాలు ఉన్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి.
ప్రశాంత్ నీల్ సినిమాలు సాధారణంగా భారీ యాక్షన్ సన్నివేశాలు, గ్రాండ్ విజువల్స్‌తో తెరకెక్కుతాయి. అందుకే ప్రతి సీన్‌ను ఎంతో కేర్‌తో, హై స్టాండర్డ్స్‌తో చిత్రీకరిస్తుండటంతో షూటింగ్ వేగం కాస్త తగ్గినట్లు సమాచారం. అంతేకాదు, ఎన్టీఆర్ పాత్రకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు కూడా భారీ స్థాయిలో ప్లాన్ చేస్తున్నారని టాక్. ఈ చిత్రంలో రుక్మిణి వసంత్ కథానాయికగా నటిస్తోంది. ఆమె పాత్ర కూడా కథలో కీలకంగా ఉండబోతుందని సమాచారం. ఇక ఎన్టీఆర్‌ను ఈ సినిమాలో ఇప్పటివరకు చూడని అవతార్‌లో చూపించేందుకు దర్శకుడు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.
‘డ్రాగన్’ చిత్రాన్ని ఎన్టీఆర్ ఆర్ట్స్ మరియు మైత్రి మూవీ మేకర్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ ప్రాజెక్ట్‌పై ట్రేడ్ వర్గాల్లో కూడా మంచి బజ్ ఉంది. ఏది ఏమైన షూటింగ్ ఇంకా సగం కూడా పూర్తి కాకపోవడంతో ‘డ్రాగన్’ విడుదలకు అభిమానులు మరికొంత కాలం వేచి చూడాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే ప్రశాంత్ నీల్ స్టైల్లో హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఈ చిత్రం తెరకెక్కుతుండటంతో, ఆలస్యం అయినా సరే ఒక బ్లాక్‌బస్టర్ సినిమా వస్తుందనే నమ్మకంతో ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.