NTR – Neel | జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కేజీఎఫ్, సలార్ వంటి బ్లాక్బస్టర్ల డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ‘డ్రాగన్’ అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాపై ఇంట్రస్టింగ్ గాసిప్స్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతున్నాయి. ఇప్పటికే షూటింగ్ ప్రారంభమైన ఈ సినిమాపై తాజాగా స్క్రిప్ట్ మార్పులు జరుగుతున్నాయంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఎన్టీఆర్ నటించిన వార్ 2 చిత్రం బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత స్థాయిలో వర్కౌట్ కాలేదన్న టాక్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపించింది. ఎన్టీఆర్ విలన్‌గా మంచి పనితీరు కనబర్చినప్పటికీ, సినిమాకి మిక్స్డ్ రెస్పాన్స్ రావడంతో…జూనియర్ తన తదుపరి ప్రాజెక్టుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలని నిర్ణయించుకున్నట్లు సమాచారం.
టాక్ ప్రకారం, ఎన్టీఆర్ “డ్రాగన్” సినిమాలో తన పాత్రను ఇంకా పవర్‌ఫుల్‌గా, మాస్ ఆడియన్స్‌కు కనెక్ట్ అయ్యేలా ఉండాలని కోరినట్లు సమాచారం. ప్రేక్షకుల అభిరుచులను దృష్టిలో పెట్టుకుని, పాన్-ఇండియా మార్కెట్‌ను దృష్టిలో ఉంచుకుని, స్క్రిప్ట్‌లో కొన్ని కీలక మార్పులు సూచించారట.ప్రశాంత్ నీల్ కూడా ఎన్టీఆర్ సూచనలను పాజిటివ్‌గా తీసుకుని, కథను మరింత ఎమోషనల్ డెప్త్ మరియు మాస్ అట్రాక్షన్‌తో మలచే ప్రయత్నంలో ఉన్నట్లు సమాచారం.ఈ మార్పుల కారణంగా “డ్రాగన్” కథలో కొన్ని కీలక మార్పులు చోటు చేసుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. ఇది కేవలం యాక్షన్ ఎంటర్టైనర్గా మాత్రమే కాకుండా, స్టోరీతోనూ ఆకట్టుకునేలా తీర్చిదిద్దే ప్రయత్నం జరుగుతోంది.
ఫ్యాన్స్ అంచనాలను అందుకోవడంతో పాటు, ఎన్టీఆర్ పాన్-ఇండియా స్టార్‌డమ్‌ను ఇంకొంత పెంచేందుకు ఇలా ప్లాన్ చేసి ఉంటారని భావిస్తున్నారు. ప్రశాంత్ నీల్ స్క్రీన్ మీద చూపించే మాస్ విజువల్స్‌కి ఎన్టీఆర్ అద్భుతమైన స్క్రీన్ ప్రెజెన్స్ కలవడం అంటే అభిమానులకు సొగసైన ట్రీట్ దక్కడం ఖాయం. ఇప్పుడు స్క్రిప్ట్‌కి మరింత బలాన్ని అందించాలని ఎన్టీఆర్ చేసిన సూచనలతో, ‘డ్రాగన్’ సినిమా ఆడియన్స్‌కు ఒక కొత్త ఎక్స్పీరియన్స్ ఇవ్వనుందా అనే చర్చ మొదలైంది.