NTR Neel | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్, కన్నడ స్టార్ దర్శకుడు కేజీఎఫ్, సలార్ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ (PrashanthNeel) కాంబోలో ఒక సినిమా రానున్న విషయం తెలిసిందే. #NTRNeel గా రానున్న ఈ సినిమాను గతేడాది ప్రకటించగా ఇప్పటివరకు పట్టాలెక్కలేదు. అయితే ఈ క్రేజీ కాంబో షూటింగ్ ఎప్పుడు మొదలవుతుందా.. ఎప్పుడెప్పుడు సినిమా నుంచి అప్డేట్లు వస్తాయా అని తారక్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ఈ సినిమా షూటింగ్ సంబంధించి సాలిడ్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్.
తాజాగా ఈ సినిమా షూటింగ్ నేడు(ఆగస్ట్ 9) పూజా కార్యక్రమాలతో ప్రారంభించారు. రామానాయుడు స్టూడియోస్‌లో ఈ వేడుక జరుగగా.. ఈ వేడుకకు ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ఇరు కుటుంబ సభ్యులు ఈ ఈవెంట్‌కు హాజరయ్యారు. అయితే ఈ ఈవెంట్‌కు తారక్ హాజరు కావాట్లేదని సోషల్ మీడియాలో వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఈ వార్తలకు చెక్ పెడుతూ.. ముహూర్తపు సన్నివేశానికి క్లాప్ కొట్టాడు. తారక్ భార్య లక్ష్మీ ప్రణతి కెమెరా స్విచ్ ఆన్ చేసింది. ఈ సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ భారీ బడ్జెట్‌తో నిర్మించబోతుంది. ఈ సినిమాను జనవరి 09 2026లో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు చిత్రబృందం ప్రకటించింది.
NtrNeel
https://t.co/Db82PF660u pic.twitter.com/AFNS5Tbi2s
— devipriya (@sairaaj44) August 9, 2024
Also Read..