NTR Neel | టాలీవుడ్ అగ్ర కథానాయకుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్, కేజీఎఫ్, సలార్ చిత్రాల దర్శకుడు ప్రశాంత్ నీల్ కాంబోలో ఒక సినిమా రాబోతున్న విషయం తెలిసిందే. #NTRNeel అంటూ రానున్న ఈ ప్రాజెక్ట్‌ను మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఎన్టీఆర్ 31వ ప్రాజెక్ట్ ఇది పట్టాలెక్కబోతుంది. ప్రస్తుతం ఈ ప్రాజెక్ట్ శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. ఇప్పటికే హైదరాబాద్‌లోని పలు లొకేషన్స్‌లో ప్రశాంత్ నీల్ కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. అయితే తాజాగా ఈ మూవీ షూటింగ్ నుంచి ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ విరామం తీసుకున్నట్లు తెలుస్తుంది.
శనివారం సాయంత్రం ఎన్టీఆర్ – ప్రశాంత్ నీల్ హ్యాంగ్ అవుట్ అవుతూ కనిపించారు. దీనికి సంబంధించిన ఫొటోలను ప్రశాంత్ నీల్ సతీమణి లిఖిత ఇన్‌స్టా వేదికగా పంచుకుంది. వీరిద్దరిని చూస్తుంటే కేవలం భయం అనే ఒకే ఒక్క మాట గుర్తుకు వస్తుందంటూ లిఖిత రాసుకోచ్చింది. కాగా ఇందుకు సంబంధించిన ఫొటో వైరల్‌గా మారింది.