NTR -NEEL | యంగ్ టైగర్ ఎన్టీఆర్ .. ఆర్ఆర్ఆర్ సినిమా తర్వాత జోరు పెంచాడు. దేవర చిత్రంతో పలకరించిన జూనియర్ ఆగస్ట్ లో వార్ 2 చిత్రంతో టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులని కూడా అలరించేందుకు సిద్ధమయ్యాడు. ఇక ఇప్పుడు ప్రశాంత్ నీల్‌తో కలిసి క్రేజీ ప్రాజెక్ట్ చేస్తున్నాడు.ఈ చిత్రం మాస్ ఎంటర్టైనర్గా రూపొందుతుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్‌లో ఈ మూవీ తెరకెక్కుతుండగా, రీసెంట్ గానే ఎన్టీఆర్ సెట్స్‌లోకి జాయిన్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీకి కోసం ఎన్టీఆర్ తన లుక్ పూర్తిగా మార్చుకున్నారు. బాగా బక్క చిక్కి గతంలో ఎప్పుడు కనిపించని విధంగా కనిపించి అందరు షాక్ అయ్యేలా చేశారు.
తాజాగా ఎన్టీఆర్- ప్రశాంత్ నీల్ చిత్రానికి సంబంధించి ఓ ఆసక్తికర విషయం నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఈ సినిమా ఎంట్రీ సీక్వెన్స్ కోసం భారీ సెట్స్ వేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ గెటప్ చాలా కొత్తగా ఉండనుందని, ఎన్టీఆర్ ఫ్యాన్స్ కోసం స్పెషల్ గా ఈ సీక్వెన్స్ ను డిజైన్ చేసినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. ఈ సీక్వెన్స్ లో ఎన్టీఆర్ తో పాటు దాదాపు వేయి మంది జూనియర్ ఆర్టిస్ట్‌లు కూడా స్క్రీన్ లో కనిపిస్తారట. ఈ వార్త విని ఫ్యాన్స్ లో ఊహల్లో తేలిపోతున్నారు. ఇక ఈ మూవీ టైటిల్ ‘డ్రాగన్’ అని ప్రచారంలో ఉంది. ఐతే, ‘డ్రాగన్’ సినిమాని ఎన్టీఆర్ కెరీర్ లోనే అత్యుత్తమ సినిమాల్లో ఒకటిగా మార్చాలని ప్రశాంత్ నీల్ గట్టి ప్రయత్నాలే చేస్తున్నాడు.
ఈ సినిమా స్క్రిప్ట్ కోసం ప్రశాంత్ నీల్ చాలా టైమ్ తీసుకున్నాడు కాబట్టి మూవీని హాలీవుడ్ స్టాండర్డ్స్‌లో తీయడం పక్కా అనే టాక్ వినిపిస్తుంది. మైత్రీ మూవీ మేకర్స్ మరియు ఎన్టీఆర్ ఆర్ట్స్ కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నాయి. ఈ సినిమాకు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఎన్టీఆర్, నీల్ ప్రాజెక్ట్ తరువాత కొరటాల శివతో దేవర 2 మూవీని ఎన్టీఆర్ చేస్తాడు. మరోవైపు త్రివిక్రమ్‌తో మైథలాజికల్ మూవీ కూడా చేయబోతున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ సినిమాపై ఎక్స్పెక్టేషన్స్ చాలా ఉన్నాయి కాని ఇంత వరకు దానిపై అధికారిక ప్రకటన రాలేదు.