NTR | యంగ్ టైగర్ ఎన్టీఆర్ తాజాగా ‘మ్యాడ్ స్క్వేర్’ మూవీ సక్సెస్ మీట్ కు గెస్ట్ గా హాజరైన విషయం తెలిసిందే. ఈవెంట్లో ఎన్టీఆర్ చాలా హుషారుగా మాట్లాడారు. దేవర హిట్ చేసినందుకు కూడా కృతజ్ఞతలు తెలిపారు. దేవర మూవీని మీ భుజాలపై మోసి, ఆదరించినందుకు ప్రేక్షకులకు కృతజ్ఞతలు. మీకోసం నేను ఎప్పటికీ కష్టపడతాను అని అన్నారు. అలానే తన అప్ కమింగ్ చిత్రాలపై క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఇన్ని రోజులు ఎన్టీఆర్ లైనప్‌కి సంబంధించి అభిమానులలో అనేక డౌట్స్ ఉండగా, ఇప్పుడు వాటిపై ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయ్యాయి.
మ్యాడ్ స్క్వేర్ మూవీ టీమ్ అందరి గురించి తొలుత మాట్లాడిన తారక్.. ఆ తర్వాత సెక్యూరిటీ రీజన్స్ వల్ల దేవర మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అవ్వగా.. ఆ తర్వాత విజయోత్సవ వేడుక జరపాలన్నా కూడా కుదరలేదు అని అన్నారు. ఇక దేవర సీక్వెల్ గురించి మాట్లాడుతూ.. దేవర సీక్వెల్ క్యాన్సిల్ అయిందని అప్పట్లో టాక్ వచ్చింది. కాని కచ్చితంగా సీక్వెల్ ఉంటుందని తారక్ తెలిపారు. దేవర-2 లేదని అనుకున్న వారందరికీ చెబుతున్నా.. కచ్చితంగా సీక్వెల్ ఉంటుంది. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీ చేయాల్సి ఉన్న నేపథ్యంలో దేవర 2కి కాస్త గ్యాప్ ఇచ్చామని అన్నారు.
అంటే కొరటాల శివతో దేవర-2, ప్రశాంత్ నీల్ తో ఒక సినిమా.. మొత్తం రెండు చేస్తున్నట్లు క్లారిటీ ఇచ్చారు. అలానే నాగవంశీ నిర్మాతగా తాను ఓ సినిమా చేయనున్నానని వెల్లడించారు తారక్. ఆ ప్రాజెక్ట్ స్టార్ట్ అయిన డేన ఫ్యాన్స్ ను హ్యాండిల్ చేసే పూర్తి బాధ్యత తనకు అప్పగించబోతున్నట్లు చెప్పుకొచ్చారు ఎన్టీఆర్. ఇక పొగడాలి అన్నా, తిట్టాలన్నా కూడా వంశీనే దానికి ఇన్చార్జ్ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జైలర్ ఫేమ్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో ఎన్టీఆర్ ఓ సినిమా చేస్తారని అప్పట్లో ప్రచారం జరగగా, ఆ మూవీని నాగవంశీ నిర్మించనున్నారని తెలుస్తుంది. కామెడీ చేయడం కష్టం కాబట్టి అదుర్స్ చేయడం లేదని నవ్వుతూ అన్నారు. ఇక అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో వార్2 అనే చిత్రాన్ని హృతిక్ రోషన్‌తో కలిసి చేస్తున్నాడు జూనియర్. ఇలా పలు సినిమాలతో రానున్న రోజులలో ఫుల్ ఎంటర్టైన్ అందించనున్నాడు.