NTR-Koratala Siva Movie | కొరటాల శివ నుంచి బిగ్ అప్డేట్.. ఎన్టీఆర్‌తో షూటింగ్ మొదలు పెట్టేది అప్పుడేనట?
NTR-Koratala Siva Movie | సందేశాత్మక సినిమాలను తెరకెక్కిస్తూ సినీరంగంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న దర్శకుడు కొరటాల శివ. రైటర్‌గా సినీ కెరీర్‌ను ప్రారంభించిన శివ ప్రభాస్ నటించిన ‘మిర్చి’ సినిమాతో దర్శకుడిగా మారి వరుసగా బ్లాక్ బాస్టర్ హిట్లను సాధించాడు. ఇప్పటివరకు ఫ్లాప్ చూడని దర్శకులలో శివ ఒకడు. ప్రభాస్, మహేష్‌బాబు, ఎన్టీఆర్లకు లైఫ్‌లో గుర్తుండి సినిమాలను ఇచ్చాడు. ప్రస్తుతం ఈయన తెరకెక్కించిన ‘ఆచార్య’ విడుదలకు సిద్ధంగా ఉంది. చిరంజీవి ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రంలో రామ్‌చరణ్ కీలకపాత్రలో నటించాడు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రమోషన్లను జరపడంలో బిజీగా ఉంది. ఇక శివ తన తదుపరి సినిమాను ఎన్టీఆర్‌తో చేయనున్నట్లు గతంలోనే ప్రకటించాడు. తాజాగా ఈ ప్రాజెక్ట్‌పై శివ మేజర్ అప్డేట్ను తెలిపాడు.
కొరటాల శివ, ఎన్టీఆర్ కాంబోలో తెరకెక్కుతున్న రెండవ సినిమాపై ప్రేక్షకులలో భారీగా అంచనాలున్నాయి. గతంలో వీళ్ళ కాంబోలో వచ్చిన ‘జనతా గ్యారేజ్’ బాక్సాఫీస్ దగ్గర ఘన విజయం సాధించింది. మరోసారి ఈ కాంబో సెట్స్‌పైకి వెళ్ళడంతో ప్రేక్షకులలో ఆసక్తి నెలకొంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన విషయాలను శివ వెల్లడించారు. ప్రస్తుతం చిత్ర బృందం ప్రీ ప్రొడక్షన్ పనులలో బిజీగా ఉన్నామని, ఈ చిత్ర షూటింగ్‌ను జూన్‌లో ప్రారంభించనున్నట్లు తెలిపాడు. అంతేకాకుండా ఈ సినిమాను పాన్ ఇండియా లెవల్లో తెరకెక్కించనున్నట్లు తెలిపాడు. ఇక ఈ చిత్రంలో ఎన్టీఆర్‌కు జోడీగా ఆలీయాభట్ నటించనున్నట్లు మేకర్స్ గతంలోనే ప్రకటించారు. అయితే తాజాగా ఆలీయా ఈ ప్రాజెక్ట్ నుంచి తప్పుకుందని, మేకర్స్ మరో బాలీవుడ్ భామను వెతికే పనిలో ఉన్నారని సమాచారం. దీనిపై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఈ చిత్రాన్ని సుధాకర్ మిక్కిలినేనితో కలిసి ఎన్టీఆర్ ఆర్ట్ పతాకంపై నందమూరీ కళ్యాణ్ రామ్ నిర్మిస్తున్నాడు.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
- Tags
- koratalasiva
- NTR
- ntr30
- Tollywood
RELATED ARTICLES
తాజా వార్తలు
priest predicted son, shot dead | కొడుకు పుడతాడని జోస్యం చెప్పిన పూజారి.. కుమార్తె జన్మించడంతో ఆయనపై కాల్పులు జరిపి హత్య
Fauzi | దర్శకుడికి గాయం.. ప్రభాస్ ‘ఫౌజీ’ షూటింగ్‌కు చిన్న బ్రేక్
Tragedy | పండుగ పూట విషాదం.. రోడ్డు ప్రమాదంలో అన్న, చెల్లి దుర్మరణం
Sunitha Lakshma Reddy | తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ పండుగ: మాజీ మంత్రి సునీత లక్ష్మారెడ్డి
Chirumarthi Lingaiah | నిరుద్యోగులను మోసం చేసిన కాంగ్రెస్‌కు బుద్ది చెప్పాలి : మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

