Ntr-Korata Siva | యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నాడు. రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రంలో తారక్ నటన వర్ణనాతీతం. తారక్ ఈ చిత్రం కోసం ఏకంగా మూడున్నరేళ్ళ సమయం తీసుకున్నాడు. ఇక ఈ మూడున్నరేళ్ళ కష్టం తారక్‌కు వృధా కాలేదు. ఈ చిత్రంతో తారక్ అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇదిలా ఉంటే తారక్ ఈ మూడేళ్ళ గ్యాప్‌ను పూర్తి చేసేందుకు వరుసగా సినిమాలను లైన్లో పెడుతున్నాడు. ఈ క్రమంలోనే తారక్ తన 30వ సినిమాను కొరటాల శివతో చెయ్యబోతున్నట్లు ప్రకటన వచ్చింది. ఎన్టీఆర్ నెక్ట్స్ సినిమాపై మేకర్స్ తాజాగా బిగ్ అప్డేట్ను ప్రకటించారు.
ఎన్టీఆర్ తదుపరి చిత్రానికి సంబంధించిన అప్డేట్ను మేకర్స్ మే19 గురువారం 7.02నిమిషాలకు ప్రకటించనున్నట్లు పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ పోస్టర్లో తారక్.. చేతిలో రక్తంతో తడిసిన కత్తిని పట్టుకుని ఉన్నాడు. ఈ పోస్టర్‌తో ప్రేక్షకులలో క్యూరియాసిటీ విపరీతంగా పెరిగింది. దాంతో చిత్రం నుంచి ఎలాంటి అప్డేట్ వస్తుందా అని అభిమానులతో పాటు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌తో కలిసి నందమూరీ కళ్యాణ్‌రామ్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడు. ప్రస్తుతం ఈ చిత్రం ప్రీ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. గతంలో వీరిద్దరి కాంబినేషన్లో తెరకెక్కిన ‘జనతాగ్యారేజ్’ బ్లాక్‌బస్టర్ విజయం సాధించింది. దాంతో మరోసారి ఈ కాంబోలో సినిమా తెరకెక్కనుండటంతో ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి.
The Lightning is all set to strike ⚡
Most awaited #NTR30 update at 7:02 PM Today 💥
Stay tuned!@tarak9999 #KoratalaSiva @NTRArtsOfficial @YuvasudhaArts pic.twitter.com/8VvLX4EOO6
— Yuvasudha Arts (@YuvasudhaArts) May 19, 2022