‘ఆర్ఆర్ఆర్’ కోసం హిందీభాషలో తొలిసారి సొంత గళాన్ని వినిపించబోతున్నారు ఎన్టీఆర్. ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్, రామ్‌చరణ్ కథానాయకులుగా నటిస్తున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’. తొలితరం స్వాతంత్య్రసమరయోధులు అల్లూరి సీతారామరాజు, కొమరంభీం పాత్రలకు కాల్పనిక అంశాలను జోడిస్తూ రూపొందిస్తున్న ఈ చిత్రం జనవరి 7న ప్రేక్షకుల ముందుకురానున్నది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో ఈ సినిమాను విడుదలచేయబోతున్నారు. హిందీతో పాటు, తమిళం, కన్నడ భాషల్లో ఎన్టీఆర్ స్వయంగా తన పాత్రకు డబ్బింగ్ చెప్పనున్నట్లు తెలిసింది. దక్షిణాదితో పాటు హిందీ భాషల పట్ల ఎన్టీఆర్‌కు ఉన్న పరిజ్ఞానాన్ని గమనించిన దర్శకుడు రాజమౌళి అన్ని భాషల్లోనూ కొమరంభీం పాత్రకు ఎన్టీఆర్‌ను డబ్బింగ్ చెప్పమని కోరినట్లు సమాచారం. ఎన్టీఆర్ అందుకు అంగీకరించారని చెబుతున్నారు. అలియాభట్, ఒలివియామోరీస్ కథానాయికలుగా నటిస్తుండగా అజయ్‌దేవ్‌గణ్, శ్రియ కీలక పాత్రలను పోషిస్తున్నారు.