యంగ్ టైగర్ ఎన్టీఆర్ సినిమా కోసం ఎంతగా శ్రమిస్తారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.ఆయన సినిమాలలో గమనిస్తే ఒక సినిమాలో లావుగా కనిపిస్తే మరో సినిమాలో బక్కపలచగా దర్శనమిస్తుంటారు. ఎంతో డెడికేషన్‌తో ప్రతి సినిమా కోసం పని చేస్తూ వస్తున్న ఎన్టీఆర్ తాజాగా జిమ్‌లో గాయపడ్డాడట. ఇంటి జిమ్‌లో వ్యాయామాలు చేస్తున్న సమయంలో ఎన్టీఆర్ కుడి చేతి వేలుకు గాయం అయ్యింది.
నాలుగు రోజుల క్రితం వైద్యులు మైనర్ సర్జరీ చేశారు. వైద్యుల సూచన మేరకు ప్రస్తుతం తారక్ ఇంట్లో రెస్ట్ తీసుకుంటున్నారు. రీసెంట్గా ఎన్టీఆర్ దీపావళి సందర్భంగా తన కుమారులతో కలిసి దిగిన పిక్ షేర్ చేయగా, ఇందులో ఎన్టీఆర్ కుడి చేతి వేలికి కట్టు ఉండడం గమనించవచ్చు. త్వరలోనే ఆయన కోలుకోవాలని అభిమానులు ప్రార్ధిస్తున్నారు. ఇటీవలే మెగాస్టార్ చిరంజీవి చేతికి కూడా సర్జరీ జరిగింది. కుడి చేతి మణికట్టు దగ్గరలో ఉన్న మీడియన్ నర్వ్ అనే నరం మీద ఒత్తిడి పడటం నొప్పి రావడంతో వైద్యులను సంప్రదించారు చిరు.
బాలకృష్ణ కూడా ఈ మధ్యే భుజం సర్జరీ చేయించుకున్న విషయం తెలిసిందే.కేర్ ఆసుపత్రి వైద్యులు బాలకృష్ణకు సర్జరీ చేశారు. దాదాపు నాలుగు గంటలపాటు ఈ సర్జరీ జరిగినట్లుగా తెలుస్తోంది. కాగా, ఎన్టీఆర్ ప్రస్తుతం ఎవరు మీలో కోటీశ్వరులు చిత్రంతో పాటు కొరటాల శివ సినిమాతో బిజీగా ఉన్నారు.