NTR | కళ్యాణ్ రామ్ హీరోగా విజయశాంతి కీలక పాత్రలో రూపొందిన చిత్రం అర్జున్ సన్ ఆఫ్ వైజయంతి. ఏప్రిల్ 18న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో గత కొద్ది రోజులుగా చిత్ర ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. గత రాత్రి మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించగా, ఈ కార్యక్రమానికి జూనియర్ ఎన్టీఆర్ చీఫ్ గెస్ట్‌గా హాజరై సందడి చేశారు. అయితే ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ అభిమానుల హంగామా ఎక్కువైంది. ఎవరు మాట్లాడుతున్నా కూడా ఎన్టీఆర్..ఎన్టీఆర్ అని లేదా సీఎం సీఎం అని గోల చేస్తూ స్పీచ్‌ని సక్రమంగా సాగనివ్వలేదు. విజయశాంతి మాట్లాడుతున్న సమయంలో కూడా ఎన్టీఆర్ అభిమానులు గోల చేశారు.
ఆ సమయంలో జూనియర్ ఎన్టీఆర్..స్టేజ్‌పైన ఉండమంటారా, వెళ్లమంటారా అన్న టైపులో సైగ చేశారు. విజయశాంతి స్పీచుని విననివ్వకుండా ఒకటే అరుపులు. అవి చూసి విజయశాంతి కూడా స్పీచ్ ఆపేసింది. బాబూ నీ ఫ్యాన్స్ ఉత్సాహం ఎక్కువగా ఉంది.. చూస్తుంటే భయంకరంగా ఉంది అని విజయశాంతి అనడంతో ఎన్టీఆర్ వార్న్ చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది. మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్ కూడా ఎన్టీఆర్ అభిమానులతో దద్దరిల్లిపోయింది. ఇక ఎన్టీఆర్ స్పీచ్ ఇచ్చే వరకు, ఎన్టీఆర్ వంతు వచ్చే వరకు అభిమానులు ఆగలేక తెగ గోల చేశారు.
ఇక అర్జున్ సన్నాఫ్ వైజయంతి ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఎన్టీఆర్ మాట్లాడుతూ.. విజయశాంతి లేకపోతే ఈ సినిమా లేదు. రాసి పెట్టుకోండి ఆఖరిగా వచ్చే 20 నిమిషాలు థియేటర్ లో కూర్చున్న ప్రతి ఒక్కరి కళ్లలో నీళ్లు తిరుగుతాయి. ఈ సినిమా కళ్యాణ్ రామ్ అన్న కెరియర్ లో ఒక స్పెషల్ ఫిలింగా నిలిచిపోతుందనేది నా నమ్మకం. 18న అద్భుతమైన మూవీ రాబోతోంది. ఆగస్టు 14న వార్ 2 మూవీ రిలీజ్ కాబోతోంది. ఆ మూవీ కూడా చాలా అద్భుతంగా వచ్చింది. తప్పకుండా మిమ్మల్ని అలరిస్తుంది. కొంచెం ఎండలు తగ్గిన తర్వాత పకడ్బందీగా ప్లాన్ చేసి త్వరలోనే మిమ్మల్ని అందరినీ కలుసుకుంటాను. కొంచెం ఓర్పు, సహనంతో ఉండండి. నందమూరి అభిమానులు అంటే ఓర్పు, సహనానికి మారుపేరు. త్వరలోనే మనం అందరం కలుసుకుందాం. మాట్లాడుకుందాం అని ఎన్టీఆర్ అనడంతో ఫ్యాన్స్ ఆనందానికి అవధులు లేవు.
Once again Auditorium erupted ❤️🔥❤️🔥🔥🔥🔥🔥#ArjunSonOfVyjayanthi #ManOfMassesNTR @tarak9999pic.twitter.com/YX21URq52b
— NTR Cult Fans 🐉 (@NTRCF_14) April 12, 2025