NTR | సినిమా ఇండస్ట్రీలో హీరోలు, దర్శకులు, నిర్మాతల మధ్య మంచి స్నేహ బంధం ఉండడం సహజమే. కాని వారి సతీమణులు కూడా సరదాగా కొన్ని సందర్భాలలో కనిపించి అందరిని ఆశ్చర్యపరుస్తుంటారు. తాజాగా వంశీ పైడిపల్లి, సుకుమార్ ఫ్యామిలీస్‌తో ఎన్టీఆర్ ఫ్యామిలీ తళుక్కున మెరిసింది. వీరితో ప్రశాంత్ నీల్ కూడా ఉన్నారు. వీరిందరిని అలా చూసి ఫ్యాన్స్ తెగ మురిసిపోతున్నారు. డైరెక్టర్ వంశీ పైడిపల్లి భార్య మాలిని బర్త్ డే సందర్భంగా వీరంతా కలిసినట్టు తెలుస్తుంది. సుకుమార్ సతీమణి తబిత ఈ పిక్ సోషల్ మీడియాలో షేర్ చేస్తూ.. ఆనందం, నవ్వు, ప్రేమతో నిండిన రోజు.. అన్నీ మాలిని ప్రత్యేక దినోత్సవ వేడుకల్లోనే! మెమోరీస్ క్రియేట్ చేసుకున్నాం ఇంకా చాలా ఉన్నాయంటూ తబిత తన పోస్ట్‌లో పేర్కొంది.
అయితే మహేష్ బాబు తన ఫ్యామిలీతో వెకేషన్‌కి వెళ్లాడు కాబట్టి అతను మిస్ అయ్యాడు. లేదంటే ఈ గ్రూప్ పిక్‌లో మహేష్ బాబు ఫ్యామిలీ కూడా ఉండేది. ఎందుకుంటే వంశీ పైడిపల్లి ఫ్యామిలీకి మహేష్ ఫ్యామిలీ చాలా క్లోజ్. వంశీ కూతురు, మహేష్ కూతురు ఇద్దరు కలిసి గతంలో ఓ యూట్యూబ్ ఛానెల్ కూడా లాంచ్ చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ పిక్‌ని చూసిన నెటిజన్స్ .. ఫ్రెండ్ షిప్ గోల్స్ అంటూ క్రేజీ ట్యాగ్ ఇస్తున్నారు. తారక్ ఎక్కడుంటే అక్కడ ఫుల్ సందడి ఉంటుందని అంటున్నారు. రీసెంట్గా మ్యాడ్ స్క్వేర్ సక్సెస్ మీట్లో కనిపించిన తారక్ మళ్లీ ఇప్పుడు వంశీ సతీమణి బర్త్ డే వేడుకలోనే మెరిసారు.
వార్ -2 షూటింగ్ ను పూర్తి చేసిన ఎన్టీఆర్.. ప్రశాంత్ నీల్ తో మూవీకి సంబంధించిన పనులతో బిజీగా ఉన్నాడు. మరి కొద్ది రోజులలోనే ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. వచ్చే ఏడాది ఈ సినిమా.. వరల్డ్ వైడ్ గా గ్రాండ్ గా రిలీజ్ కానుంది. ఆ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ దేవర 2 చిత్రంతో పాటు మరి కొన్ని సినిమాలని ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మరోవైపు, సుకుమార్ ఇప్పుడు రిలాక్స్ డ్ మోడ్ లో ఉన్నారు. రీసెంట్ గా పుష్ప-2తో మంచి విజయాన్ని అందుకున్న సుక్కూ.. చరణ్ తో మూవీ, పుష్ప-3 పనులు స్టార్ట్ చేయనున్నారు. ఇక వంశీ పైడిపల్లి ఎలాంటి ప్రాజెక్ట్ అనౌన్స్ చేయలేదు. బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ కు స్టోరీ చెప్పినట్టు వార్తలు వస్తున్నా దానిపై క్లారిటీ లేదు.