యంగ్ టైగర్ ఎన్టీఆర్ వర్క్‌కి కాస్త బ్రేక్ ఇచ్చాడు. ఆర్ ఆర్ ఆర్ కోసం దాదాపు మూడేళ్లు చాలా కష్టపడ్డాడు. కఠినమైన యాక్షన్ సన్నివేశాల చిత్రీకరణలో పాల్గొనడం జరిగింది. మూడేళ్లకు పైగా సాగిన ఆర్ ఆర్ ఆర్ షూటింగ్ తో ఎన్టీఆర్ చాలా అలసిపోయారు. దీనితో ఆయన ఫ్యామిలీ తో వెకేషన్ ప్లాన్ చేశారు. భార్య లక్ష్మీ ప్రణతి, కుమారులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ లతో పాటు ఆయన విదేశీ విహారానికి వెళుతున్నారు.
ఎన్టీఆర్ స్విట్జర్లాండ్ వెళుతున్నట్లు సమాచారం అందుతుంది. దాదాపు వారం రోజులకు పైగా అక్కడే గడపనున్నారట. ఇక అక్కడ నుండి వచ్చాక ఆర్ఆర్ఆర్ చిత్ర ప్రమోషన్స్‌తో పాటు కొరటాల సినిమా, మరి కొన్ని ప్రాజెక్టులతో బిజీ కానున్నట్టు తెలుస్తుంది. ‘ఆర్ఆర్ఆర్’ తర్వాత ఎన్టీఆర్ వరుసగా క్రేజీ డైరెక్టర్స్‌తో నెక్ట్స్ ప్రాజెక్ట్ చేస్తున్నట్టు ప్రకటించారు. అందులో కొరటాల శివ, ప్రశాంత్ నీల్‌తో పాటు పలువురు దర్శకులున్నారు. ఇప్పటికే ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ పూర్తైయింది. మరోవైపు ఎన్టీఆర్ ‘ఎవరు మీలో కోటీశ్వరులు’ అనే ప్రోగ్రామ్‌కు హోస్ట్‌గా వ్యవహరిస్తున్నారు. త్వరలో ఈ షోకు ఎండ్ కార్ట్ వేయనున్నారు.
జూనియర్ ఎన్టీఆర్ 30వ చిత్రాన్ని కొరటాల శివతో చేయనున్నట్టు ప్రకటించారు. అయితే.. ఈ కాంబినేషన్ ఎపుడో సెట్ అయినా.. ఇపుడు పట్టాలెక్కింది. ఈ సినిమాను ప్యాన్ ఇండియా లెవల్లో తెరకెక్కిస్తున్నట్టు ప్రకటించారు.