Devara | ‘భయం పోవాలంటే దేవుడి కథ ఇనాలా.. భయం అంటే ఏంటో తెలియాలంటే దేవర కథ ఇనాల’.. రీసెంట్గా విడుదల చేసిన ఎన్టీఆర్ ‘దేవర’ ట్రైలర్లో డైలాగ్ ఇది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘దేవర పార్ట్ 1’ ఈ నెల 27న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఆదివారం జరగాల్సిన ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ అనుకోని కారణాల క్యాన్సిల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేశారు. ఈ ట్రైలర్ అద్భుతమైన మాస్ డైలాగులతో, విజువల్‌గా గూజ్బంప్స్ తెప్పించేలా ఉంది. ‘దేవర అడిగినాడంటే.. చెప్పినాడని అర్థం..’ లాంటి డైలాగులు ట్రైలర్లో ఆసక్తి రేకెత్తిస్తున్నాయి. రత్నవేల్ విజువల్స్, అనిరుథ్ ఆర్ఆర్, కొరటాల శివ రైటింగ్, గ్రాండ్ విజువల్స్, వీఎఫ్ఎక్స్ సినిమాకు హైలైట్స్‌గా నిలుస్తాయని నిర్మాతలు చెబుతున్నారు. ఈ చిత్రానికి సమర్పణ: నందమూరి కల్యాణ్‌రామ్, నిర్మాతలు: మిక్కిలినేని సుధాకర్, కొసరాజు హరికృష్ణ, నిర్మాణం: ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్.
ఇదిలావుంటే.. దేవర సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిలైన సందర్భంగా ఎన్టీఆర్ అభిమానులకోసం ఓ వీడియోను విడుదల చేశారు. ఈ వీడియోలో ఆయన మాట్లాడుతూ ‘ ‘దేవర’ ప్రీరిలీజ్ ఈవెంట్ క్యాన్సిల్ అవ్వడం వల్ల మీకంటే నేనే ఎక్కువ బాధపడుతున్నా. ఈ ఈవెంట్లో ‘దేవర’ అనుభవాలన్నీ మీతో పంచుకోవాలని ఆశించాను. కానీ.. సెక్యూరిటీ ప్రాబ్లమ్ వల్ల ఈవెంట్‌ని క్యాన్సిల్ చేయాల్సివచ్చింది. ఈ నెల 27న థియటర్లలో కలుద్దాం. మీకు ఆనందాన్ని పంచేందుకు ఎంతో కష్టపడి ‘దేవర’ చేశాను. ఎంతో ఇష్టపడి కొరటాల శివ ఈ సినిమా తీశారు. అది రేపు థియేటర్లలో మీరు చూస్తారు’ అని తెలిపారు.