Devara 2 Movie | ఎన్టీఆర్ కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన చిత్రం దేవర. సెప్టెంబర్ 27న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. అయితే ఈ సినిమా సక్సెస్ అందుకోవడంతో వరుసగా ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు ఎన్టీఆర్. తాజాగా యాంకర్ సుమతో ఒక ఇంటర్వ్యులో పాల్గోనగా.. ఈ ఇంటర్వ్యూలో రాజమౌళి మిత్ గురించి స్పందించారు తారక్.
దిగ్గజ దర్శకుడు రాజమౌళితో సినిమా చేసిన అనంతరం ఆ హీరో తర్వాతి సినిమా ఫ్లాప్ అవ్వుతుందని ఒక పుకారు ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకు రాజమౌళితో చేసిన హీరోలు అందరూ వారి తర్వాతి సినిమాలు డిజాస్టార్‌లు అందుకున్నారు. దీంతో ఆర్ఆర్ఆర్ తర్వాత తారక్ దేవర రావడంతో ఇది కూడా ఫ్లాప్ అనుకున్నారు. అయితే అందరూ అనుకున్నట్లు కాకుండా చిత్రం బ్లాక్ బస్టర్ అందుకుంది. తాజాగా ఇదే విషయంపై తారక్‌ను సుమ అడుగగా..
తారక్ మాట్లాడుతూ.. మనం సరిగ్గా సినిమాలు చేసుకోలేక పాపం రాజమౌళిని అంటుంటాం. రాజమౌళి హిట్ ఇచ్చాడు కాబట్టి తర్వాతి సినిమా పోతే రాజమౌళి మీద తోసేసాం కానీ మనకి చేతగాక క్రియేట్ చేసుకున్న మిత్ ఇది. మిత్ అంటే రియాలిటీలో లేదని అర్థం. కానీ అయిన బాగుంది Myth Breaker అనేది కొంచం.. నిజం కాకపోయినా బాగుందంటూ తారక్ అన్నాడు.
#JrNTR – #KoratalaSiva react to #Devara Memes.
‘మనం correctగా సినిమాలు చేసుకోలేక, పాపం #SSRajamouli Hit ఇచ్చాడు కాబట్టి పోయిందని రాజమౌళి మీద తోసేసాం కానీ..మనకి చేతగాక create చేసుకున్న …’
But, అయినా బాగుంది Myth Breaker అనేది కొంచం… నిజం కాకపోయినా… pic.twitter.com/iE5NHzVdWz
— Gulte (@GulteOfficial) October 5, 2024