NTR | యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆర్ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్డమ్ సంపాదించుకున్న ఎన్టీఆర్ దేవర సినిమాతో మంచి హిట్ కొట్టాడు. ఇక వార్ 2 చిత్రంతో బాలీవుడ్‌లోకి అడుగుపెడుతున్నాడు. కొద్ది రోజుల క్రితం దేవర ప్రమోషన్స్ కోసం జపాన్ వెళ్లిన జూనియర్ అక్కడ తెగ సందడి చేశాడు. జపాన్ ఫ్యాన్స్ తో కలిసి నానా హంగామా చేశాడు. ఇక ఇదిలా ఉంటే ఎన్టీఆర్ తెలుగు ఆడియన్స్ మధ్యకి వచ్చి చాలా రోజులు అవుతుంది. ఆర్ఆర్ఆర్ ఈవెంట్ తర్వాత బహిరంగంగా ఆయన ఎలాంటి ఈవెంట్‌కి హాజరు కాలేదు.
‘దేవర సినిమాకు ఈవెంట్ నిర్వహించాలని మేకర్స్ ప్లాన్ చేయగా.. హైదరాబాద్ నోవాటెల్ కి ఫ్యాన్స్ పెద్ద ఎత్తున చేరారు . అక్కడ అద్దాలు పగలగొట్టడం , నానా భిబత్సం సృష్టించడంతో ఈవెంట్ నిర్వాహణపై టీం కాస్త వెనక్కి తగ్గింది. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ ఎలాంటి పెద్ద ఈవెంట్స్‌కి, ప్రీ రిలీజ్ ఫంక్షన్స్‌కి హాజరైంది లేదు. కాని ఇప్పుడు తన బావ మరిది నార్నే నితిన్ హీరోగా నటించి ‘మ్యాడ్ స్క్వేర్ మూవీ సక్సెస్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వస్తున్నారు. ఈ క్రమంలో ఎన్టీఆర్‌ను చూసేందుకు భారీగా తరలివచ్చేందుకు సిద్ధమవుతున్నారు.
ఈ క్రమంలో ఎక్కువ మంది బౌన్సర్లను పెట్టండి. పోలీస్ భద్రత చూసుకోండి. ఈవెంట్ సక్సెస్ ఫుల్‌గా జరిగేలా చూడండి. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూసుకోవాలని సోషల్ మీడియా వేదికగా కొందరు కామెంట్స్ చేస్తున్నారు. ఈవెంట్‌కు ఎన్టీఆర్ సహా మూవీ టీంతో పాటు భారీగా అభిమానులు తరలి వస్తున్నారు. అయితే ఈవెంట్ పూర్తైన తర్వాత ఎప్పుడు కూడా ఇంటికి వెళ్లేటప్పుడు జాగ్రత్తగా వెళ్లాలని.. ఇంటి వద్ద మీ వాళ్లు ఎదురు చూస్తుంటారని.. సురక్షితంగా డ్రైవింగ్ చేస్తూ ఇంటికి చేరుకోవాలని సూచిస్తుంటారు. ఈవెంట్ వద్ద కూడా ఫ్యాన్స్ భద్రతపై ఫోకస్ చేసేలా నిర్వాహకులకు ఆయన టీం సూచిస్తుంది.