NTR-ANR| తెలుగు సినిమా చరిత్రలోఎన్టీఆర్, ఏఎన్ఆర్ ల పేర్లు సువర్ణాక్షరాలతో లికించబడింది. వారి నటనకు తెలుగు కళ్ళామ్మ తల్లే మురిసిపోయింది అంటే అతిశయోక్తి కాదు. నటనలో తమకు తామే సాటి అని నిరూపించుకున్న అక్కినేని నాగేశ్వరావు, ఎన్టీఆర్ కలిసి పలు సినిమాలు చేశారు. ఆ సినిమాలు ఎంత పెద్ద హిట్ అయ్యాయో మనందరికి తెలిసిందే. తెలుగు సినిమా చరిత్ర అంటే ముందుగా మనకు గుర్తొచ్చేది ఎన్టీఆర్ , ఎన్నాఆర్ పేర్లే.. ఎన్టీరామారావు తో కలిసి నాగేశ్వరావు 14 సినిమాల్లో నటించారు.అలాగే తెలుగు సినిమాను చెన్నై నుంచి హైదరాబాద్ కు తీసుకురావడంలో వారి పాత్ర ముఖ్యమైనది. అయితే భవిష్యత్లో ఎంతమంది హీరోలు వచ్చిన కూడా తెలుగు సినీ పరిశ్రమ ఉన్నంత కాలం వారి పేర్లు అలా నిలిచిపోతాయి.
ఇప్పటికీ ఎప్పటికీ వారిని సినిమా పరిశ్రమకు రెండు కళ్ళుగా భావిస్తారు ..మద్రాసులో ఉన్న తెలుగు సినిమా పరిశ్రమని హైదరాబాద్కి తీసుకురావడానికి వారు ఎంతో కృషి చేశారు. అయితే ఎన్టీఆర్, ఏఎన్ఆర్ తమ కేరీర్లో ఎంతోమంది హీరోలతో కలిసి నటించారు ..అయితే ఒక స్టార్ హీరోయిన్ విషయంలో వీరిద్దరూ కలిసి ఆమెపై నిషేధం విధించిన సందర్భం ఒకటి ఉంది అనే విషయం మీకు తెలుసా? సెట్లో ఎవరిని లెక్క చేయకపోవడంతో వారు ఆమెని బ్యాన్ చేశారట. ఆ హీరోయిన్ మరెవరో కాదు జమున. షూటింగ్ సమయంలో ఎంత స్టార్ హీరో ఉన్నా పెద్ద డైరెక్టర్ ఉన్నా కూడా ఎవరిని లెక్క చేసేది కాదట.
కాలు మీద కాలు వేసుకొని హీరో కన్నా నేను ఏం తక్కువ అన్నట్టుగా ప్రవర్తించేదట. అక్కినేని నాగేశ్వరరావు సినిమా షూటింగ్ జరుగుతున్నప్పుడు ఇలాగే బిహేవ్ చేయడం ఏఎన్ఆర్ చాలా నొచ్చుకున్నారు. వెంటనే ఎన్టీఆర్ తో చెప్పి బ్రదర్ జమున చాలా అహం బావి ఆమెకు మన సినిమాలలో అవకాశాలు ఇవ్వవద్దు అని చెప్పడం తో దాదాపు మూడేళ్ల పాటు జమునకు ఎన్టీఆర్ , ఏఎన్నార్ తమ సినిమాలలో అవకాశాలు ఇవ్వలేదట .. చివరకు నాగిరెడ్డి , చక్రపాణి ఈ విషయంలో జోక్యం చేసుకొని రాజీ కుదర్చడంతో తిరిగి జమునతో కలిసి పని చేశారు ఎన్టీఆర్,ఏఎన్ఆర్