జనతా గ్యారేజ్ తర్వాత కొరటాల శివ (Siva Koratala), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) కాంబినేషన్లో వస్తున్న ప్రాజెక్ట్ ఎన్టీఆర్ 30 (NTR 30). నందమూరి అభిమానులతోపాటు ప్రతీ ఒక్కరూ ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు. తాజాగా అభిమానులను ఖుషీ చేసే వార్త ఒకటి నెట్టింట హల్ చల్ చేస్తోంది. అదేంటంటే కొరటాల శివ టీం ప్రస్తుతం లొకేషన్ల వేటలో ఉందట.
ఈ మూవీ నీరు ప్రధానాంశం నేపథ్యంలో రాబోతుండగా.. నీటిలో జరిగే ఓ భారీ ఫైట్ సన్నివేశంతో షూటింగ్ మొదలు కాబోతున్నట్టు ఇన్సైడ్ టాక్ నడుస్తుండగా.. ఈ ఎపిసోడ్ కోసమే కొరటాల టీం లొకేషన్లను గుర్తించే పనిలో ఉందని తెలుస్తోంది. ఈ చిత్రంలో హీరోయిన్గా ఎవరు కనిపించబోతున్నారన్నది ప్రస్తుతానికి సస్పెన్స్ నెలకొంది.
ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఇటీవలే డైరెక్టర్ కొరటాల మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌తో సినిమా ఆల్బమ్ గురించి చర్చించిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. NTR 30 ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మాణంలో మల్టీ లింగ్యువల్గా రానుంది. పాపులర్ సినిమాటోగ్రాఫర్ రత్నవేల్ ఈ చిత్రానికి పనిచేయబోతున్నాడు.
Read Also : Mahesh Babu | తండ్రి గురించి మహేశ్‌బాబు ఎమోషనల్ ట్వీట్..
Read Also : Allari Naresh | చివరి 20 నిమిషాల క్లైమాక్స్ సినిమాకే హైలెట్ : అల్లరి నరేశ్
Read Also : Kriti Sanon | స్కూల్‌కు వెళ్లిన మహేశ్ హీరోయిన్ కృతిసనన్ .. స్పెషల్ ఏంటంటే..?
Read Also : Manjima Mohan | మంజిమా మోహన్-గౌతమ్ కార్తీక్ వెడ్డింగ్ డేట్ ఫిక్స్
Read Also : Hari Hara Veera Mallu | మీ మద్దతు ఉంటుందని ఆశిస్తున్నాం.. హరిహర వీరమల్లు టీం సందేశం