కొరటాల శివ (Siva Koratala), జూనియర్ ఎన్టీఆర్ (Jr NTR) క్రేజీ కాంబినేషన్లో మరో సినిమా వస్తుందని తెలిసిందే. ఎన్టీఆర్ 30 (NTR 30)గా తెరకెక్కనున్న ఈ చిత్రానికి అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ప్రాజెక్ట్ షూటింగ్ మొదలుపెట్టేందుకు కొరటాల టీం ప్రిపరేషన్ ప్లాన్ మొదలుపెట్టింది. ప్రస్తుతం ఈ సినిమా షూట్‌కు సంబంధించిన అప్డేట్ నెట్టింట హల్ చల్ చేస్తోంది.
తాజా రిపోర్ట్స్ ప్రకారం ఎన్టీఆర్ 30 కోసం ఓ భారీ సెట్టును నిర్మించే పనిలో ఉన్నారట కొరటాల టీం. టాప్ ఆర్ట్ డైరెక్టర్ సాబు సిరిల్ నేతృత్వంలో సెట్ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి. ఈ సెట్లో తారక్‌పై వచ్చే యాక్షన్ పార్టుతోపాటు కొంత టాకీ పార్టు పూర్తి చేయబోతున్నారని సమాచారం. సెట్టు ఉత్తమ క్వాలిటితో ఉండేలా బడ్జెట్ పెడుతున్నారట మేకర్స్.
ఇక ఈ చిత్రంలో ఫీ మేల్ లీడ్ రోల్లో ఎవరు కనిపిస్తారనే దానిపై సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. మరి ఏ భామ తారక్‌తో రొమాన్స్ చేసే ఛాన్స్ కొట్టేస్తుందనేది చూడాలి. ఈ మూవీ 2024 ఏప్రిల్ 5న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానుందని ముందుగానే ప్రకటించారు మేకర్స్. ఎన్టీఆర్ ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ సంయుక్త నిర్మాణంలో మల్టీ లింగ్యువల్ ప్రాజెక్ట్‌గా NTR 30 తెరకెక్కనుంది. పాపులర్ సినిమాటోగ్రాఫర్ రత్నవేల్ ఈ చిత్రానికి పనిచేస్తున్నారు.
జనతాగ్యారేజ్ తర్వాత వస్తున్న సినిమా అవడంతో ఎన్టీఆర్ 30పై అంచనాలు భారీగానే ఉన్నాయి. ఇప్పటికే విడుదలైన ఎన్టీఆర్ 30 మోషన్ పోస్టర్ సినిమాపై అంచనాలు పెంచుతోంది. ఈ సినిమాలో కథానుగుణంగా వీఎఫ్ఎక్స్ టెక్నాలజీని వాడబోతున్నారని తెలుస్తోంది.
ఎన్టీఆర్ 30 మోషన్ పోస్టర్..
My next with Koratala Siva… https://t.co/iPyKSQ9Sjs pic.twitter.com/xaEB1ZbwON
— Jr NTR (@tarak9999) May 19, 2022