Leo | కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ (Vijay) కాంపౌండ్ నుంచి వస్తున్న మోస్ట్ అవెయిటెడ్ ప్రాజెక్ట్ లియో (Leo.. Bloody Sweet). స్టార్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రంలో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. లియోలో కీలక పాత్ర పోషిస్తున్న మలయాళ భామ శాంతి మాయాదేవి ఇప్పటికే లియో షూటింగ్లో జాయిన్ అయింది. ఈ సందర్భంగా లోకేశ్ కనగరాజ్‌తో దిగిన సెల్ఫీ నెట్టింట హల్ చల్ చేస్తోంది. తాజాగా మరో షూటింగ్ అప్డేట్ ఇండస్ట్రీ సర్కిల్లో రౌండప్ చేస్తోంది.
తాజాగా లియో షూటింగ్లో యాక్షన్ కింగ్ అర్జున్ (Arjun Sarja)కూడా చేరిపోయినట్టు ఇన్సైడ్ టాక్. యాక్షన్ ప్యాక్డ్ షెడ్యూల్ చెన్నైలో ఇవాళ ప్రారంభమైనట్టు సమాచారం. కాగా ఈ షెడ్యూల్ కొన్ని రోజుల పాటు సాగనుందట. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో బాలీవుడ్ యాక్టర్ సంజయ్‌దత్, యాక్షన్ కింగ్ అర్జున్, ప్రియా ఆనంద్, మన్సూర్ అలీఖాన్, గౌతమ్ వాసు దేవ్‌మీనన్, మిస్కిన్, మాథ్యూ థామస్, సాండీ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
లియో అక్టోబర్ 19న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కానున్నట్టు ఇప్పటికే మేకర్స్ వెల్లడించారు. లియో చిత్రానికి టాలెంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందిస్తున్నాడు. సెవెన్ స్క్రీన్ స్టూడియోపై తెరకెక్కుతున్న ఈ చిత్రానికి లోకేశ్ కనగరాజ్, రత్నకుమార్, ధీరజ్ వైడీ డైలాగ్స్ రాస్తున్నారు. లియో చిత్రం మాస్టర్ తర్వాత విజయ్, లోకేశ్ కనగరాజ్ కాంబినేషన్లో వస్తున్న రెండో సినిమా అవడంతో అంచనాలు భారీగానే ఉన్నాయి.
లియో టైటిల్ ప్రోమో..
దళపతి 67 సర్ప్రైజ్..