Leo | దళపతి విజయ్ (Vijay) కాంపౌండ్ నుంచి వస్తున్న క్రేజీ చిత్రం లియో (Leo.. Bloody Sweet). యాక్షన్ ఎంటర్టైనర్గా వస్తున్న ఈ చిత్రానికి లోకేశ్ కనగరాజ్ (Lokesh Kanagaraj) దర్శకత్వం వహిస్తున్నాడు. మేకర్స్ ఇప్పటికే లాంఛ్ చేసిన లియో టైటిల్ ప్రోమో గ్లింప్స్ వీడియోతోపాటు లియో ఫస్ట్ లుక్ నెట్టింట హల్ చల్ చేస్తూ.. సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాయి. లోకేశ్ కనగరాజ్ కథానుగుణంగా కొన్ని పాత్రలకు మధ్యలో చెక్ పెట్టేస్తుంటాడని తెలిసిందే. లియోలో త్రిష విషయంలో ఇదే జరుగుతుందా..? ఆందోళనలో పడిపోయాడు ఓ అభిమాని.
విక్రమ్‌లో గాయత్రి అమర్ పాత్రను మధ్యలో చంపేసినట్టుగా.. లియోలో త్రిష పాత్రకు ఎలాంటి హాని చేయొద్దని ఓ అభిమాని డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్‌ను కోరాడు. దీనికి లోకేశ్ నవ్వుతూ.. ఆమె (త్రిష)కు ఎలాంటి హాని జరుగదు.. బాధపడొద్దు.. అని హామీనిచ్చాడు. లియోలో త్రిష పాత్ర ఇదివరకు సినిమాల్లా ఉండబోదని క్లారిటీ రావడంతో సదరు అభిమాని ఆనందంలో మునిగిపోయాడు.
ఇండస్ట్రీలో నేనెక్కువ కాలం కొనసాగను. 10 సినిమాలు చేసి మానేస్తానని మరోసారి చెప్పుకొచ్చాడు. లియో ఆడియో లాంఛ్ సెప్టెంబర్‌లో జరుగుతుందన్నాడు లోకేశ్. ఈవెంట్ మధురైలో జరుగుతుందా..? అని అడుగగా.. మేము ఇప్పుడే సినిమా పూర్తి చేశాం. ఇంకా ఏదీ నిర్ణయించుకోలేదన్నాడు. విజయ్‌తో మళ్లీ మూడోసారి సినిమా చేసేందుకు రెడీగా ఉన్నారా..? అన్న ప్రశ్నకు స్పందిస్తూ.. తప్పకుండా. ఆయన గ్రీన్ సిగ్నల్ ఇస్తే చేస్తానని చెప్పుకొచ్చాడు. దీంతో రాబోయే కాలంలో హ్యాట్రిక్ సినిమా ఉండే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని అర్థమవుతోంది.
ఈ ప్రాజెక్టులో త్రిష ఫీ మేల్ లీడ్ రోల్లో నటిస్తోంది. లియోలో బాలీవుడ్ నటుడు సంజయ్‌దత్, యాక్షన్ కింగ్ అర్జున్, ప్రియా ఆనంద్, మలయాళ నటి శాంతి మాయాదేవి, మన్సూర్ అలీఖాన్, మాథ్యూ థామస్, సాండీ కీలక పాత్రలు పోషిస్తున్నారు.
నా రెడీ ఫుల్ లిరికల్ వీడియో సాంగ్..
నా రెడీ సాంగ్ ప్రోమో..
లియో టైటిల్ ప్రోమో..