Kalki 2898 AD | గ్లోబల్ స్టార్ ప్రభాస్ (Prabhas) కాంపౌండ్ నుంచి వస్తోన్న సైన్స్ ఫిక్షన్ జోనర్ చిత్రం కల్కి 2898 ఏడీ (Kalki 2898 AD). తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో థియేటర్లలో ప్రపంచవ్యాప్తంగా జూన్ 27న గ్రాండ్‌గా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రభాస్, నాగ్ అశ్విన్ టీం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. వైజయంతీ మూవీస్ తెరకెక్కిస్తోన్న ఈ సినిమాకు సంబంధించిన ఆసక్తికర అప్డేట్ తెరపైకి వచ్చింది.
తమిళనాడులో ఈ చిత్రాన్ని శివకార్తికేయన్‌తో ఎస్కే 23 చిత్రాన్ని తెరకెక్కిస్తున్న శ్రీలక్ష్మి మూవీస్ పంపిణీ చేయనుంది. కల్కి 2898 ఏడీ థ్రియాట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను శ్రీలక్ష్మి మూవీస్ భారీ మొత్తానికి దక్కించుకుంది. ఈ బ్యానర్ గతంలో తమిళనాడులో పుష్ప ది రైజ్‌ను విడుదల చేయగా మంచి వసూళ్లు రాబట్టింది. మరి కల్కి 2898 ఏడీ ఎలాంటి కలెక్షన్లు రాబడుతుందో చూడాలి.
ఇప్పటికే మేకర్స్ The Prelude of Kalki2898AD పేరుతో ఎపిసోడ్ 1 ను విడుదల చేయగా.. ఈ కథ అన్నింటికీ క్లైమాక్స్. మన కలియుగంలో ఏం జరుగబోతుంది. ఎలా జరుగొచ్చు. కేవలం ఇండియాలోనే కాదు ప్రపంచంలో ప్రతీ ఒక్కరూ ఈ కథతో అనుబంధం కలిగిఉంటారంటూ సినిమాపై క్యూరియాసిటీ పెంచుతున్నాడు నాగ్ అశ్విన్. ఈ మూవీలో ప్రభాస్ భైరవ (Bhairava) పాత్రలో నటిస్తుండగా.. అతడి దోస్త్ బుజ్జి (Bujji)గా స్పెషల్ కారు కనిపించనుంది.
ఈ చిత్రంలో బాలీవుడ్ భామలు దీపికా పదుకొనే, దిశా పటానీ ఫీ మేల్ లీడ్ రోల్స్‌లో నటిస్తుండగా.. బెంగాలీ నటుడు శాశ్వత ఛటర్జీ మెయిన్ విలన్‌గా కనిపించబోతున్నాడు. లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, రాజేంద్రప్రసాద్, పశుపతి ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు.