Prabhas – Malavika Mohanan | పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌పై యువ నటి మాళవిక మోహనన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బయట కనిపించే ప్రభాస్ ఇమేజ్‌కు భిన్నంగా ఆయన వ్యక్తిత్వం ఉంటుందని వెల్లడించారు. ప్రస్తుతం ప్రభాస్ హీరోగా మారుతి దర్శకత్వంలో రూపొందుతున్న ‘ది రాజా సాబ్’ చిత్రంలో మాళవిక మోహనన్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ అనుభవాలను పంచుకుంటూ, ప్రభాస్ గురించి ఆమె చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
మాళవిక మోహనన్ ఇటీవల సోషల్ మీడియాలో అభిమానులతో ముచ్చటిస్తూ, ప్రభాస్‌తో తన అనుభవాలను పంచుకున్నారు. “నేను ప్రభాస్ సార్‌ను కలవడానికి ముందు ఆయన ఇంటర్వ్యూలు చూసినప్పుడు చాలా సైలెంట్‌గా, రిజర్వ్డ్గా ఉంటారని అనుకున్నాను. కానీ ఆయనను స్వయంగా కలిసినప్పుడు మంచి మాటకారి, సూపర్ ఫన్, ఫన్నీ అని అర్థమైంది” అని మాళవిక తెలిపారు. ప్రభాస్‌తో సమయం గడపడానికి చాలా చక్కని వ్యక్తులలో ఒకరని, ఆయన చుట్టూ ఎప్పుడూ బోరింగ్ క్షణమే ఉండదని ఆమె ప్రశంసించారు.
ప్రభాస్ తన సహనటులను సెట్లో ఆహారంతో ఆకట్టుకుంటారని, ఒక గ్రామానికి సరిపడా రుచికరమైన భోజనాన్ని ఏర్పాటు చేస్తారని మాళవిక మోహనన్ గతంలోనూ వెల్లడించారు. ఇటీవల విడుదలైన ‘కల్కి 2898 AD’ సినిమా విజయం తర్వాత కూడా ప్రభాస్ చాలా సింపుల్‌గా, డౌన్ టు ఎర్త్ గా ఉన్నారని ఆమె కొనియాడారు. మాళవిక చేసిన ఈ వ్యాఖ్యలు ప్రభాస్ అభిమానులను మరింత సంతోషపరుస్తున్నాయి. ‘ది రాజా సాబ్’ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రభాస్, మాళవిక మోహనన్ ల కాంబినేషన్ ఈ సినిమాకు మరింత ఆకర్షణగా మారింది.