వరుణ్‌తేజ్ కథానాయకుడిగా రూపొందుతోన్న పీరియాడిక్ పాన్ ఇండియా యాక్షన్ డ్రామా ‘మట్కా’. కరుణకుమార్ దర్శకుడు. డాక్టర్ విజయేందర్‌రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి నిర్మాతలు. 1958 నుంచి 1982వరకూ అంటే, ఇరవైనాలుగేండ్లపాటు సాగే కథతో, ఊహించని మలుపులతో సాగే చిత్రమిది. ఇప్పటికే హైదరాబాద్ ఆర్ఎఫ్సీలో కీలకమైన భారీ షెడ్యూల్ పూర్తయింది. పాతకాలం నాటి వైజాగ్‌ని తలపించేలా నిర్మించిన మ్యాసీవ్ సెట్లో కథలోని కీలక సన్నివేశాలతోపాటు, భారీ యాక్షన్ ఎపిసోడ్స్నీ.. అలాగే రెట్రో థీమ్ సాంగ్స్‌ని మేకర్స్ చిత్రీకరించారు.
ప్రమోషన్లో భాగంగా ఇందులో ఓ కథానాయికగా నటిస్తున్న నోరా ఫతేహీ పోస్టర్ని కూడా విడుదల చేశారు. నోరా డాన్సులు సినిమాకు హైలైట్‌గా నిలుస్తాయని, ముఖ్యంగా జానీ మాస్టర్ కొరియోగ్రఫీలో చేసిన పాటను నంబర్ ఆఫ్ డాన్సర్‌తో గ్రాండ్‌గా షూట్ చేశామని, ప్రస్తుతం కొత్త షెడ్యూల్ వైజాగ్‌లో శరవేగంగా జరుగుతున్నదని మేకర్స్ తెలిపారు. మీనాక్షి చౌదరి మరో కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో నవీన్‌చంద్ర, అజయ్‌ఘోష్, కన్నడ కిశోర్ తదితరులు ఇతర పాత్రధారులు. ఈ చిత్రానికి కెమెరా: ఏ.కిశోర్‌కుమార్, సంగీతం: జి.వి.ప్రకాశ్‌కుమార్, నిర్మాణం: వైర ఎంటర్టైన్మెంట్స్, ఎస్ఆర్టి ఎంటర్టైన్మెంట్స్.