లండన్: బ్రిటీష్ ఫిల్మ్ అవార్డ్స్ బాఫ్టా వేడుకలు.. ఆదివారం రాత్రి వర్చువల్‌గా జరిగాయి. అమెరికా నేపథ్యంలో తీసిన నోమాడ్‌ల్యాండ్ సినిమాకు నాలుగు బాఫ్టా అవార్డులు దక్కాయి. బెస్ట్ డైరక్టర్ అవార్డు చొలే జావోకు వెళ్లింది. నోమాడ్‌ల్యాండ్ సినిమాను ఆమే డైరక్ట్ చేసింది. ఈ సినిమాకు బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ ఫిల్మ్ అవార్డులు కూడా దక్కాయి. ఈసారి బాఫ్టాలో మహిళా డైరక్టర్ల మధ్య తీవ్ర పోటీ నెలకొన్నది. పశ్చిమ అమెరికా ప్రాంతంలో వ్యాన్‌లో జీవించే ఓ మహిళ జీవిత కథను నోమాడ్ల్యాండ్లో చిత్రీకరించారు. ఆ సినిమాలో ప్రధాన పాత్ర పోషించిన ఫ్రాన్సిస్ మెక్ డార్మాండ్కు బెస్ట్ యాక్టర్ అవార్డు దక్కింది. బాఫ్టా చరిత్రలో ఓ మహిళా డైరక్టర్‌కు అవార్డు దక్కడం గత 53 ఏళ్లలో ఇది రెండవ సారి మాత్రమే.
ఇక బెస్ట్ యాక్టర్ అవార్డును ఆంధోనీ హాప్కిన్స్ గెలుచుకున్నారు. ద ఫాదర్ చిత్రంలో ఆయనకు ఈ అవార్డు దక్కింది. 27 ఏళ్ల క్రితం బాఫ్టాలో అవార్డు గెలిచిన ఆయన ఆ తర్వాత మళ్లీ ఇప్పుడు అవార్డును ఎగురేసుకుపోయారు. 83 ఏళ్ల వయసులో ఆంధోనీ హాప్కిన్స్ అవార్డు గెలుచుకోవడం విశేషం. ఈ అవార్డును అందుకున్న అత్యంత వృద్ధుడు ఆయనే.