The Odyssey | హాలీవుడ్ దర్శకుడు క్రిస్టోఫర్ నోలాన్ (Christopher Nolan) సినిమాలకు వరల్డ్ వైడ్‌గా ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. అతడి సినిమా వస్తుందంటే హాలీవుడ్‌తో పాటు ఇండియాలో ఉన్న అభిమానులు కూడా థియేటర్లకు ఎగబడతారు. ఇప్పటికే ఆయన దర్శకత్వంలో వచ్చిన బ్యాట్‌మ్యాన్ ట్రయాలజీ, ఇంటర్స్టెల్లార్, ఓపెన్‌హైమర్, డన్కిర్క్, టెనెట్ వంటి చిత్రాలు సూపర్ హిట్ అందుకున్నాయి. అయితే తాజాగా ఆయన దర్శకత్వంలో రాబోతున్న చిత్రం ‘ది ఆడెస్సీ’ (The Odyssey). హాలీవుడ్ స్టార్ నటులు మాట్ డామన్, టామ్ హాలండ్ ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది జూలై 17న విడుదల కాబోతుంది. అయితే ఈ సినిమా విడుదలకు సరిగ్గా ఏడాది ఉండగా ఇప్పటినుంచే అడ్వాన్స్ బుకింగ్స్ స్టార్ట్ చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. ప్రస్తుతం అమెరికాలోని ఐమ్యాక్స్ 70 ఎం.ఎం. స్క్రీన్స్‌కు సంబంధించిన టికెట్లు అందుబాటులోకి వచ్చినట్లు నిర్వహాకులు ప్రకటించారు. అయితే ఈ సినిమా విడుదలకు ఇంకా ఏడాది ఉండి కూడా ఈ రేంజ్లో క్రేజ్ ఉండడంపై సినీ ప్రియులు ఆశ్చర్యం వ్యక్తంచేస్తున్నారు.