ప్రేమించే టైమ్ లేదు

తనకు బాయ్‌ఫ్రెండ్స్ ఎవరూ లేరని అంటోంది కూర్గ్ సొగసరి రష్మిక మందన్న. వృత్తితోనే తాను ప్రేమలో ఉన్నట్లు చెబుతోంది. ప్రస్తుతం దక్షిణాదితో పాటు బాలీవుడ్లో సినిమాలు చేస్తూ బిజీగా ఉంది రష్మిక మందన్న. కరోనా వ్యాప్తితో చిత్రీకరణలు నిలిచిపోవడంతో విరామ సమయాన్ని ఏకాంతంగా ఆస్వాదిస్తోంది. ఈ గ్యాప్‌లో ఇటీవల ఇన్స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో ముచ్చటించింది ఈ సుందరి. ‘మీకు బాయ్‌ఫ్రెండ్ ఉన్నాడా’?అని ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు ‘నటనపైనే నా దృష్టంతా ఉంది. ప్రేమించడానికి సమయం లేదు. హార్డ్‌వర్క్‌నే నా బాయ్‌ఫ్రెండ్‌గా భావిస్తున్నా’నని రష్మిక బదులిచ్చింది. తాను ఎవరితో డేటింగ్లో లేనని చెప్పింది. ‘డేటింగ్‌కు ఎలా వెళ్లాలో నాకు తెలియదు. సాహసోపేతమైన క్రీడల్లో పాల్గొనడానికి ప్రాముఖ్యతనిస్తా. వాటిలోనే ఆనందాన్ని వెతుక్కుంటా. అదే డేటింగ్‌గా నేను భావిస్తా’ అని పేర్కొన్నది. విజయ్‌దేవరకొండతో మళ్లీ ఎప్పు డూ సినిమా చేస్తారని అడగ్గా సరైన కథ దొరికితే తప్పకుండా విజయ్‌తో సినిమా చేస్తానని..ఆ క్షణాల కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు వెల్లడించింది. షూటింగ్‌లతో పాటు కరోనా వ్యాప్తి కారణంగా కుటుంబానికి దూరంగా ఉండాల్సివస్తోందని, అమ్మానాన్నల్ని కలిసి ఐదునెలలు దాటిందని రష్మిక చెప్పింది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Benjamin Netanyahu: ఇజ్రాయెల్ ఎన్నికల్లో విదేశీ జోక్యం: బెంజిమన్ నెతన్యహూ
KTR | ఇంకా ఆ వరుసలో చాలా మంది ఉన్నారు.. కొండా సురేఖ క్షమాపణలపై కేటీఆర్
CPM | తెలంగాణ రైతాంగాన్ని ఆదుకునేందుకు కేంద్రం రూ.50 వేల కోట్లు నష్టపరిహారంగా అందించాలి : సీపీఎం
YCP Letter | ఏపీలో పింఛన్ల పంపిణీపై రాష్ట్ర ఎన్నికల సంఘానికి వైసీపీ లేఖ
Ramayana | పాకిస్తాన్‌లోనూ తగ్గేదేలే అంటున్న ‘రామాయణ’ క్రేజ్.. కరాచీ వీడియో వైరల్!
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

