బ్రిటిష్ అకాడమీ ఆఫ్ ఫిలిం అండ్ టెలివిజిన్ ఆర్ట్స్ (బాఫ్టా) అవార్డ్స్ ప్రధాన కార్యక్రమం లండన్ లోని ఆల్బర్డ్ హాల్లో కనుల పండుగగా జరిగింది. ఈ కార్యక్రమానికి ప్రియాంక, నిక్ దంపతులు హాజరు కాగా రెడ్ కార్పెట్‌పై నడుస్తున్న వీరిద్దరిని చూసి అంతా మైమరచిపోయారు. ముఖ్యంగా ప్రియాంక చోప్రా తన స్టైలిష్ డ్రెస్‌తో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకుంది. సిల్కీ వైట్ ట్రౌజర్, ఓపెన్ టాప్ ధరించిన ప్రియాంకని చూసి అందరి మతులు పోయాయి. ఇక రెడ్ కార్పెట్‌పై నడవడానికి ముందు ప్రియాంక చోప్రా బ్లాక్ కలర్ డ్రెస్‌లో దర్శనమిచ్చింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేయడంతో ఫుల్ వైరల్‌గా మారాయి.
నిక్ జోనాస్‌ను వివాహం చేసుకున్న తర్వాత బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా లండన్‌కే పరిమితమైంది. హాలీవుడ్ సినిమాలలో నటిస్తూ మరో వైపు వ్యాపారాలను ప్రారంభిస్తుంది. న్యూయార్క్ లో ‘సోనా’ పేరుతో రెస్టారెంట్ ప్రారంభించిన విషయాన్ని ఇటీవల ప్రకటించిన ప్రియాంక చోప్రా.. ఈ రెస్టారెంట్ లో నోరూరించే భారతీయ వంటకాలను వండి వడ్డించనున్నారని పేర్కొంది.
Been a while since we were on one of these… @priyankachopra #bafta pic.twitter.com/mX4vzREFmk
— Nick Jonas (@nickjonas) April 11, 2021