సినిమా పారితోషికం విషయంలో రాజీలేని వైఖరిని అవలంభిస్తోంది అగ్ర కథానాయిక దీపికాపడుకోన్. ఇందుకోసం ఏకంగా తన భర్త రణ్‌వీర్‌సింగ్ సినిమానే వదులుకుందని బాలీవుడ్లో వినిపిస్తోంది. రణవీర్‌సింగ్‌తో కలిసి రామ్‌లీలా, బాజీరావ్ మస్తానీ, పద్మావత్ వంటి విజయవంతమైన చిత్రాల్లో నటించింది దీపికాపడుకోన్. వీరిద్దరికి సూపర్‌హిట్ పెయిర్ అనే పేరుంది. తాజాగా ఈ జంట కలయికలో ‘బైజూ బావ్రా’ పేరుతో ఓ చిత్రానికి సన్నాహాలు చేస్తున్నారు అగ్ర దర్శకనిర్మాత సంజయ్‌లీలాభన్సాలీ. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కించనున్న ఈ సినిమా కోసం రణ్‌వీర్‌సింగ్‌తో సమానమైన రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట దీపికా. దీంతో ఖంగుతున్న చిత్ర నిర్మాతలు తాము అంతమొత్తం ఇవ్వలేమని తెలపడంతో ప్రాజెక్ట్ నుంచి తప్పుకుంటున్నట్లు చెప్పిందట దీపికాపడుకోన్. తమ జోడీకి ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఉందని, కోరినంత మొత్తం పారితోషికం ఇవ్వడంలో ఏమాత్రం తప్పులేదని దీపికాపడుకోన్ ఇచ్చిన సలహాను చిత్ర బృందం సున్నితంగా తిరస్కరించిందట. ప్రస్తుతం ఈ సినిమా కోసం మరో నాయికను అన్వేషించే పనిలో పడ్డారట దర్శకుడు సంజయ్‌లీలాభన్సాలీ.