NKR 21 Title Announcement | బింబిసార, డెవిల్ సక్సెస్ తర్వాత ఫుల్ జోష్‌లో ఉన్నాడు నందమూరి కల్యాణ్‌రామ్ (Nandamuri Kalyan Ram). ఆయన ప్రధాన పాత్రలో నటిస్తున్న తాజా ప్రాజెక్ట్ NKR21. యాక్షన్ జోనర్లో వస్తున్న ఈ సినిమాతో ప్రదీప్ చిలుకూరి దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. అశోక క్రియేషన్స్ తెరకెక్కిస్తోంది. ఈ సినిమాలో సీనియర్ నటి విజయశాంతి కీలక పాత్రలో నటించబోతుంది. ఈ సినిమాను అశోక్ వర్ధన్ ముప్ప, సునిల్ బలుసు, ఎన్టీఆర్ ఆర్ట్స్‌తో కలిసి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి కల్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌తో పాటు విజయశాంతిల ఫస్ట్ లుక్‌లను విడుదల చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుంది.
ఇదిలావుంటే తాజాగా మూవీ నుంచి మేకర్స్ టైటిల్ అనౌన్స్మెంట్ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమా టైటిల్‌ని వుమెన్స్ డే కానుకగా రేపు విడుదల చేయనున్నట్లు తెలిపింది. ఈ సందర్భంగా కొత్త పోస్టర్‌ను పంచుకున్నారు మేకర్స్. బేడిలతో పంచుకున్న ఫొటో చూస్తుంటే సన్ ఆఫ్ అనే పేరుతో ఈ టైటీల్ రాబోతున్నట్లు తెలుస్తుంది. మరోవైపు ఈ సినిమా టైటిల్ అర్జున్ S/o వైజయంతి అంటూ ఇప్పటికే సోషల్ మీడియాలో కామెంట్లు కనిపిస్తున్నాయి. ఈ సినిమాలో కళ్యాణ్ రామ్ సరసన సాయి మంజ్రేకర్ నటిస్తోండగా.. విజయశాంతి ఇందులో వైజయంతి ఐపీఎస్ అనే పాత్రలో నటిస్తుంది.
The FIERCEST duo is coming.
Wait for their arrival 🔥#NKR21 TITLE ANNOUNCEMENT on March 8th, 2025 ❤️🔥@NANDAMURIKALYAN @vijayashanthi_m @saieemmanjrekar @SohailKhan @PradeepChalre10 @SunilBalusu1981 @muppaav @AJANEESHB @NTRArtsOfficial @AshokaCOfficial pic.twitter.com/4lLcOHinCz— BA Raju’s Team (@baraju_SuperHit) March 6, 2025