Nithya menon |నిత్యామీనన్ తాజా సిరీస్ ‘కుమారి శ్రీమతి’కి విశేషాదరణ లభిస్తున్నది. ఈ సందర్భంగా ఆమె తన ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నారు. ‘ నా లైఫ్‌కి చాలా దగ్గరగా అనిపించే కథ ‘కుమారి శ్రీమతి’. 30ఏళ్లు దాటినా పెళ్లి చేసుకోకుండా లక్ష్యం అంటూ తిరిగే పాత్రను పోషించా.
నేను కూడా దాదాపు శ్రీమతి టైపే. ఈ సిరీస్‌లో నా తల్లి పాత్ర పోషించిన గౌతమిగారు నన్ను పెళ్లి చేసుకోమని ఒత్తిడి తెస్తూ ఉంటుంది. రియల్ లైఫ్‌లో కూడా మా అమ్మ బతికున్నప్పుడు సేమ్‌టూ సేమ్. ‘నువ్వేం సాధించావ్.. ప్రశాంతంగా పెళ్లి చేసుకో.. నీకెందుకు ఈ సినిమాలు’ అంటూ తెగ ఇబ్బంది పెట్టేది. ఈ పాత్ర చేస్తున్నప్పుడు గౌతమిగారిలో మా అమ్మను చూశా ను’ అంటూ చెప్పుకొచ్చింది నిత్యామీనన్.