నిత్యామీనన్‌కి కోపం వచ్చింది. తన సోషల్ మీడియా ద్వారా నెటిజన్స్‌కి లెప్ట్ అండ్ రైట్ ఇచ్చేసింది. వివరాల్లోకెళ్తే.. రీసెంట్గా ఈ అందాలభామ ఓ సినిమా వేడుకకు హాజరైంది. అక్కడ ఓ అభిమాని నిత్యకు షేక్‌హ్యాండ్ ఇవ్వడానికి ట్రై చేశాడు. కానీ నిత్యామీనన్ మాత్రం అతనికి షేక్‌హ్యాండ్ ఇవ్వకుండా, నమస్కారం చేసి, ‘నాకు జలుబు చేసింది..’ అని తప్పుకుంది. కానీ డయాస్ మీదకు వెళ్లగానే అక్కడున్న హీరోకు హగ్ ఇచ్చేసింది.
ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేస్తూ నెటిజన్లు నిత్యామీనన్‌ని ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. దాంతో ఈ బొద్దుగుమ్మకు చిర్రెత్తుకొచ్చింది. వెంటనే తన సోషల్ మీడియా ద్వారా ఈ విషయంపై క్లారిటీ ఇస్తూ.. తన శైలిలో సమాధానమిచ్చింది. ‘సినిమా హీరోయిన్లను సగటు మహిళల్లా చూడడం చాలామంది మగాళ్లకు తెలీదు. హీరోయిన్లంటే ఈజీగా టచ్ చేయొచ్చని అనుకుంటారు. సాధారణ మహిళలను ఎందుకు షేక్‌హ్యాండ్ అడగరు? మమ్మల్నే ఎందుకు అడుగుతారు? ఈజీగా ముట్టుకోడానికి హీరోయిన్లేమైనా ఆట బొమ్మలా? ’ అంటూ ఫైర్ అయ్యింది నిత్యామీనన్.