Nithya Menen | నిత్యామీనన్ ప్రతిభాపాటవాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కెరీర్ ఆరంభం నుంచి అభినయ ప్రధాన పాత్రల్లో మెప్పిస్తున్నది. ‘తిరుచిట్రంబళం’ చిత్రానికిగాను ఇటీవలే ఉత్తమ నటిగా జాతీయ పురస్కారాన్ని అందుకుంది. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో సినిమాల ఎంపికలో తన ప్రాధాన్యతల గురించి వివరించింది నిత్యామీనన్. ఆమె మాట్లాడుతూ ‘పాత్రల ఎంపికలో నాకు కొన్ని నిశ్చితాభిప్రాయాలున్నాయి.
ముఖ్యంగా భారీ బడ్జెట్తో తీసే కమర్షియల్ సినిమాల్లో నటించడం అస్సలు ఇష్టం ఉండదు. వాటిలో కథానాయిక పాత్రకు అంతగా ఇంపార్టెన్స్ ఇవ్వరు. అలాంటి అవకాశాలు వస్తే సున్నితంగా తిరస్కరిస్తాను. పాత్ర నచ్చితే చిన్న సినిమా అయినా చేస్తాను. కెరీర్ ఆరంభం నుంచి ఇదే ఫార్ములా ఫాలో అవుతున్నా’ అని చెప్పింది. ప్రస్తుతం నిత్యామీనన్ విజయ్ సేతుపతితో కలిసి ఓ తమిళ సినిమా చేస్తున్నది. దీనితో పాటు ధనుష్ ‘ఇడ్లీకడై’ సినిమాలో కథానాయికగా నటిస్తున్నది.