Nithya Menen | మల్టీటాలెంటడ్ యాక్టర్స్‌లో నిత్యా మీనన్ ఒకరు. అలామొదలైంది సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టిన ఈ అమ్మడు ఆ తర్వాత చాలా సినిమాల్లో నటించి మెప్పించింది. ఈ మధ్య కాలంలో సినిమాల స్పీడ్ తగ్గించింది. స్లో అండ్ స్టడీగా సినిమాలు చేసుకుంటూ వెళుతుంది. ‘అలా మొదలైంది’ నుంచి ‘భీమ్లా నాయక్’ వరకూ విభిన్న పాత్రలతో ఆకట్టుకున్న ఈ ముద్దుగుమ్మ రీసెంట్గా తమిళ స్టార్ విజయ్ సేతుపతితో కలిసి సార్ మేడమ్ అనే చిత్రం చేసింది. ఈ మూవీ ప్రమోషన్స్‌లో పాల్గొంటూ ఆసక్తికర విషయాలు తెలియజేస్తుంది.
నిత్యా మీనన్, విజయ్ సేతుపతి జంటగా నటించిన సార్ మేడమ్ చిత్రం తమిళంతో పాటు తెలుగులో కూడా విడుదల కాబోతోంది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని టీజీ త్యాగరాజన్ సమర్పణలో, సత్య జ్యోతి ఫిల్మ్స్ బ్యానర్‌పై సెంథిల్ త్యాగరాజన్, అర్జన్ త్యాగరాజన్ నిర్మించారు. ఆగస్టు 1న గ్రాండ్ రిలీజ్‌కి సిద్ధమవుతోంది. ఇప్పటికే ప్రమోషన్స్ జోరుగా జరుగుతున్నాయి. హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రెస్మీట్లో నిత్యా మీనన్ పాల్గొంది. ఈ సందర్భంగా పెళ్లిపై ఆమెకు ప్రశ్న ఎదురైంది. దానికి సమాధానంగా… నన్ను విజయ్ సేతుపతి గారు, దర్శకుడు పాండిరాజ్ గారు చాలా ట్రై చేశారు” అని నవ్వుతూ చెప్పింది.
అయితే ఇది కొంచెం డబుల్ మీనింగ్‌గా అనిపించడంతో వెంటనే విజయ్ సేతుపతి జోక్యం చేసుకొని..“సరిగ్గా చెప్పు.. వేరే అర్థాలు వస్తాయి!” అని అన్నారు. దీనిపై వెంటనే నిత్యా క్లారిటీ ఇచ్చింది. “అయ్యో, నేను అలా అనలేదు! పెళ్లి విషయంలో వాళ్లు నన్ను మోటివేట్ చేస్తూ ఉండేవాళ్లు అని చెప్పాలనుకున్నాను” అని వివరణ ఇచ్చింది. ఈ సంఘటనతో అక్కడున్నవారంతా తెగ నవ్వేశారు. ఇక ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది నిత్యా మీనన్ ఇప్పటివరకు తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో పలు హిట్ చిత్రాల్లో నటించి మంచి పేరు తెచ్చుకుంది. ఆమె 6 భాషల్లో మాట్లాడగలదనే టాక్ కూడా ఉంది. విజయ్ సేతుపతి, నిత్యా మీనన్ ఇద్దరికీ తెలుగు ప్రేక్షకుల్లో భారీ ఫాలోయింగ్ ఉంది. అందుకే ‘సార్ మేడమ్’ సినిమా తెలుగులో కూడా మంచి రెస్పాన్స్ పొందే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది.