Nithya Menen | ఇటీవల ప్రకటించిన జాతీయ చలన చిత్ర పురస్కారాల్లో ఉత్తమ నటిగా అవార్డును కైవసం చేసుకుంది అగ్ర కథానాయిక నిత్యామీనన్. తమిళ చిత్రం ‘తిరుచిత్రాంబలమ్’కు గాను ఆమె ఈ అవార్డును గెలుచుకుంది. తాజాగా ఈ అమ్మడు తమిళంలో మరో భారీ ఆఫర్ సొంతం చేసుకుంది. అగ్ర నటుడు విజయ్ సేతుపతికి జోడీగా నిత్యామీనన్ నటించనుంది.
పాండిరాజ్ దర్శకత్వంలో ఫ్యామిలీ డ్రామాగా ఈ చిత్రాన్ని తెరకెక్కించబోతున్నారు. శుక్రవారం ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడింది. సత్యజ్యోతి ఫిల్మ్స్ నిర్మించనున్న ఈ సినిమా త్వరలో సెట్స్‌మీదకు వెళ్లనుంది.
ఇటీవల విడుదలైన ‘మహారాజ’ సినిమా సక్సెస్‌తో విజయ్‌సేతుపతి కెరీర్లో దూసుకుపోతున్నారు. మరోవైపు జాతీయ అవార్డుతో నిత్యామీనన్ సత్తా చాటింది. ఈ ఇద్దరు వెర్సటైల్ ఆర్టిస్టుల కాంబినేషన్లో సినిమా వస్తుండడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.