వికాష్ వశిష్ట, కుషిత కళ్లపు జంటగా నటిస్తున్న చిత్రం ‘నీతోనే నేను’. అంజిరామ్ దర్శకత్వంలో ఎమ్.సుధాకర్ రెడ్డి నిర్మిస్తున్నారు. మంగళవారం ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ‘గురు బ్రహ్మ గురు విష్ణు’ అనే పాటను విడుదల చేశారు. సుద్దాల అశోక్‌తేజ రాసిన ఈ పాటను మనో ఆలపించారు.
నిర్మాత మాట్లాడుతూ ‘ఈ గీతాన్ని ఉపాధ్యాయులకు అంకితమిస్తున్నాం. విద్యావ్యవస్థలోని లోపాలను సరిదిద్దాలనే సందేశాత్మక కథాంశంతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఇందులో హీరో టీచర్ పాత్రలో కనిపిస్తారు. ఈ సినిమాలో ప్రేమకథ కూడా ఉంటుంది. త్వరలో విడుదల చేస్తాం’ అన్నారు.