నితిన్ కథానాయకుడిగా సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో రూపొందిస్తున్న చిత్రం ‘తమ్ముడు’. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని దిల్‌రాజు, శిరీష్ నిర్మిస్తున్నారు. జూలై 4న విడుదలకానుంది. ఈ నేపథ్యంలో మ్యూజికల్ ప్రమోషన్స్‌లో వేగం పెంచారు. మంగళవారం ‘జై బగళాముఖీ’ అనే పాటను విడుదల చేశారు.
‘జై బగళాముఖీ, జై శివనాయకీ, జై వనరూపిణీ, వీర విహారిణి, సర్వజీవ సంరక్షిణి జననీ..’ అంటూ అమ్మవారి మహిమను కీర్తిస్తూ ఈ గీతం సాగింది. జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు ఈ పాటను రచించారు. గ్రామ దేవతకు సంబంధించిన జాతర నేపథ్యంలో ఈ పాటను చిత్రీకరించామని, కుటుంబ అనుబంధాలకు దర్పణంలా ఈ సినిమా కథ ఆకట్టుకుంటుందని మేకర్స్ తెలిపారు. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ, స్వసిక విజయన్ తదితరులు చిత్ర తారాగణం.