Narne Nithin – NTR| తాత నందమూరి తారకరామారావు వారసుడిగా ఇండస్ట్రీకి వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ ఆనతి కాలంలోనే స్టార్ హీరోగా ఎదిగారు. సినిమా సినిమాకి తన రేంజ్ పెంచుకుంటూ వెళుతున్నారు. వార్ 2 సినిమాతో బాలీవుడ్‌లోకి కూడా అడుగుపెడుతున్నారు. గతేడాది దేవర మూవీతో సంచలన విజయం తన ఖాతాలో వేసుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద రూ. 500 కోట్ల వరకు వసూల్లు రాబట్టిన విషయం తెలిసిందే.. జూనియర్ ఎన్టీఆర్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్, బిగ్గెస్ట్ హిట్ గా నిలిచిన ఈ మూవీ ఇప్పుడు జపాన్‌లో కూడా సందడి చేసేందుకు సిద్ధమైంది.
మార్చి 28న జపాన్‌లో దేవర రిలీజ్ కానుండగా, ఈ మూవీ ప్రమోషన్స్ కోసం తారక్ తన సతీమణితో కలిసి జపాన్‌కి వెళ్లారు. ఎన్టీఆర్ సతీమణి ప్రణతి పుట్టిన రోజు మార్చి 25 మంగళవారం కాగా ప్రణతి బర్త్ డేను ఎన్టీఆర్ దగ్గరుండి గ్రాండ్ గా సెలబ్రేట్ చేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఓ ఓ క్యూట్ ఫొటోను షేర్ చేస్తూ.. అమ్మలు..హ్యాపీ బర్త్ డే అంటూ రాసుకొచ్చారు. ఇక ఎన్టీఆర్ – ప్రణతి టాలీవుడ్ క్యూట్ కపుల్స్‌లో ఒకరు. వీరిద్దరు పెళ్లైనప్పటి నుండి ఎంతో అన్యోన్యంగా ఉంటూ వస్తున్నారు. ఈ జంటకి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.
అయితే ఎన్టీఆర్ భార్య లక్ష్మి ప్రణతి సోదరుడు నార్నె నితిన్ సినీ పరిశ్రమలోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. మ్యాడ్, ఆయ్ సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ కొట్టిన నార్నె నితిన్ త్వరలో మ్యాడ్ స్వ్కేర్తో పలకరించబోతున్నాడు. అయితే మ్యాడ్ స్క్వేర్ ప్రమోషన్స్ లో భాగంగా నార్నేనితిన్ సుమ అడ్డా షోకి రాగా, ఆ షోలో ఎన్టీఆర్ బామ్మర్ధిని సుమ ఆసక్తికర ప్రశ్న వేసింది. మీ బావ జూనియర్ ఎన్టీఆర్ మీ ఇంటికి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు మీతో ఏం మాట్లాడారు అని అడగ్గా నార్నె నితిన్ సమాధానమిస్తూ.. ఆయన పెళ్లి చూపులకు వచ్చినప్పుడు నన్ను స్కూల్ కి పంపించేశారు. కనీసం నాకు చెప్పలేదు, నాకు పెళ్లి చూపులు అని కూడా తెలీదు అని చెప్పారు. అప్పుడు నాది స్కూల్ ఏజ్. ఇక హీరో అవుదాం అని ఎన్టీఆర్‌కి చెప్పినప్పుడు ఓకే చెయ్యి కానీ ఇండస్ట్రీలో ఉన్న సమస్యల గురించి క్లియర్‌గా చెప్పారని నార్నె నితిన్ అన్నాడు.