హీరో నితిన్ గత కొంతకాలంగా భారీ విజయం కోసం ఎదురుచూస్తున్నారు. ఇటీవల విడుదలైన ‘తమ్ముడు’ చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. మరోవైపు ఒకప్పుడు వరుస బ్లాక్‌బస్టర్ హిట్స్‌తో అగ్ర దర్శకుడిగా వెలుగొందారు శ్రీనువైట్ల. ఆయన గత చిత్రం ‘విశ్వం’ సైతం ప్రేక్షకుల్ని నిరాశపరచింది.
ఈ నేపథ్యంలో వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కనుందనే వార్తలు ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తున్నాయి. దీనిని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ రూపొందించనుందని టాక్. శ్రీను వైట్ల శైలి వినోదాంశాలతో ఈ చిత్రానికి సన్నాహాలు జరుగుతున్నాయని తెలిసింది. అయితే ఈ వార్తలో నిజమెంతో తెలియాలంటే చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.