నితిన్ కథానాయకుడిగా శ్రీరామ్ వేణు దర్శకత్వంలో రూపొందుతున్న ప్రతిష్టాత్మక చిత్రం ‘తమ్ముడు’. లయ, వర్ష బొల్లమ్మ, సప్తమి గౌడ కీలక పాత్రధారులు. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ చిత్రం జూలై 4న గ్రాండ్‌గా విడుదల కానుంది. ప్రమోషన్లో భాగంగా ఈ నెల 11న సాయంత్రం 5గంటలకు ఈ సినిమా ట్రైలర్‌ని మేకర్స్ విడుదల చేయనున్నారు. ఈ సందర్భంగా ‘తమ్ముడు’ మూవీ ట్రైలర్ రిలీజ్ అనౌన్స్మెంట్ వీడియోను ఫన్నీగా మేకర్స్ డిజైన్ చేశారు.
లయ, వర్ష బొల్లమ్మ, స్వసిక విజయన్, సప్తమి గౌడ, బేబీ శ్రీరామ్ఆదిత్య అందరూ కలిసి ఈ సినిమా ట్రైలర్ రిలీజ్‌కీ తామంటే తామే కారణమని గొడవ పడుతుండగా.. దర్శకుడు శ్రీరామ్ వేణు వచ్చి ‘మీ డౌట్స్ అన్నీ క్లారిఫై కావాలంటే ముందు ట్రైలర్ చూడండి..’ అని చెప్తాడు. ఈ విధంగా మూవీ లవర్స్‌లో సినిమాపై ఆసక్తి పెరిగే విధంగా ట్రైలర్ అనౌన్స్మెంట్ వీడియోను మేకర్స్ డిజైన్ చేశారు. ఎంసీఏ, వకీల్‌సాబ్ చిత్రాల తర్వాత శ్రీరామ్ వేణు దర్శకత్వం వస్తున్న ఈ సినిమా దర్శకుడిగా అతని స్థాయిని మరింత పెంచేలా ఉంటుందని మేకర్స్ చెబుతున్నారు. ఈ చిత్రానికి కెమెరా: కేవీ గుహన్, సంగీతం: అజనీష్ లోకనాథ్.